బాబు మగాడ్రా బుజ్జీ..!

 

 

 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంత తెగింపు ఉన్న నాయకుడో రాష్ట్ర ప్రజలకు మాత్రమేకాదు.. దేశం మొత్తానికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి తన తెగింపును ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డదారిలో సంపాదించుకునే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ బిజీగా వుంది. టీఆర్ఎస్ వేర్పాటు గానాన్ని ఎంత గొంతు చించుకుని పాడుతున్నా అటు సీమాంధ్ర ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలు కూడా చంద్రబాబుకి మద్దతు పలుకుతున్నారు.

 

 

ఇది ఎంతమాత్రం మింగుడుపడని టీఆర్ఎస్ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ప్రతిక్షణం ప్రయత్నిస్తూ విఫలమవుతూనే వుంది. చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ప్రొజెక్ట్ చేయడానికి తంటాలు పడుతోంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నాడు నల్లగొండ జిల్లాలోని దామరచర్ల దగ్గర వున్న తాళ్ళ వీరప్పగూడెంలో వర్షానికి దెబ్బతిన్న పత్తిపంట రైతులను పరామర్శించడానికి చంద్రబాబు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజున తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తే నానాయాగీ చేయడానికి టీఆర్ఎస్ అన్ని సన్నాహాలూ చేసింది.

 



ఈ విషయం తెలిసినా చంద్రబాబు వెనుకడుగు వేయలేదు. దామరచర్లకు చేరుకుని, వర్షానికి దెబ్బతిన పత్తిపంటని పరిశీలించి, రైతులకు నైతిక మద్దతును అందించారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్రోహదినం పాటిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు చంద్రబాబు పర్యటన సందర్భంగా కాస్తంత హడావిడి చేశారు. వాటిని ఎంతమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు ముందుకు వెళ్ళారు. ప్రజల సంక్షేమం కోరుకునే నాయకుడిగా తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చారు.  తమను పరామర్శించడానికి వచ్చిన రైతుల నుంచి చంద్రబాబుకు చక్కని స్పందన లభించింది. దామరచర్ల ప్రాంతంలోని రైతులు చంద్రబాబును తమసొంత మనిషిలా భావించి ఆయన దగ్గర తమ కష్టసుఖాలు వెళ్ళబోసుకున్నారు. ఇదంతా తెలంగాణ నాయకుల గొంతులో వెలక్కాయపడేలా చేసింది. తాము హడావిడి చేస్తామని తెలిసినా రైతులను పరామర్శించడానికి  వచ్చిన చంద్రబాబు ధైర్యాన్ని వాళ్ళు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.