కుప్పంలో చంద్రబాబు రోడ్ షో
posted on Dec 29, 2023 @ 1:59PM
కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో శుక్రవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. కుప్పం ప్రజలు ప్రతీ ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తున్నారని అన్నారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీ దొంగల ముఠాల లెక్కలు తేల్చుతామన్నారు. టిడిపి హాయంలో ప్రజల వద్దకు పాలనా, జన్మ భూమి కార్యక్రమాలు కుప్పం నుంచే శ్రీకారం చుట్టామని చంద్ర బాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విచ్చల విడిగా భూ కబ్జాలు జరుగుతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వానికి మిగిలింది వంద రోజులేనన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని నా జీవితంలో చూడలేదని చంద్రబాబు అన్నారు. టిడిపి అధికారంలో రాగానే నిరుద్యోగులకు మూడు వేల భృతి కల్పిస్తామన్నారు. జగన్ చేతిలో పాలన పిచ్చోడి చేతిలో రాయి అన్నారు. కుప్పం నియోజక వర్గంలో 500 టిడిపి కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదన్నారు.