Read more!

రామ‘చంద్రుడు’ ఇతడూ...

 

 

 

ఒకవైపు బీజేపీతో తెలుగుదేశం పొత్తు కుదుర్చుకుంది. మరోవైపు ఈరోజు శ్రీరామనవమి. దాంతో తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడిని శ్రీరాముడితో పోలుస్తూ మురిసిపోతున్నారు. ఆ పోలికలిలా వున్నాయి...

 

రాముడు క్రమశిక్షణ కలిగిన ఆదర్శపురుషుడు. చంద్రబాబు కూడా అలాగే డిసిప్లిన్‌కి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. నాయకులు ఆదర్శంగా తీసుకోవలసిన వ్యక్తి.

రాముడు పీతాంబరధారం. చంద్రబాబు పచ్చ వస్త్రధారి.

తండ్రి మాటకు కట్టుబడి రాముడు అరణ్యవాసం చేశాడు. ప్రజల తీర్పుకు కట్టుబడి చంద్రబాబు సమర్థమైన ప్రతిపక్షాన్ని నడిపారు.

రాముడి లక్ష్యం రావణ సంహారం. చంద్రబాబు లక్ష్యం కాంగ్రెస్ సంహారం.

రాముడి లక్ష్య సాధనకు వానరసేన అండగా నిలిచింది. చంద్రబాబు లక్ష్య సాధనకు బీజేపీ వానరసేన అండగా నిలుస్తోంది