Read more!

అవినీతి సొమ్ము కోసం... అవిశ్వాసం అంటున్నారు: చంద్రబాబు

 

 

బ్లాక్ మెయిలింగ్ కోసం, తమ కేసులు మాఫీ చేయించుకోవడం కోసం అవినీతి సొమ్ము కాపాడుకోవడం కోసం, శిక్షలు తప్పించుకోవడం కోసం మాత్రం నేను అవిశ్వాసం పెట్టను అని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నా అని భావిస్తే వెంటనే అవిశ్వాసం పెడతామని చంద్రబాబు స్పష్టంచేశారు.


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును ఓడించి, దానికి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయడానికి తొమ్మిదేళ్లు కావాలా? ఇంతకంటే ఘోరమైన పాలన ఉంటుందా అని ఆయన ప్రజలతో వ్యాఖ్యానించారు. ఇదొక్కటి చాలు కాంగ్రెస్ అసమర్థతను నిరూపించడానికి అన్నారు.


రాజకీయ అజ్ఞానులు, అవిశ్వాసం ఎప్పుడు పెడతారో తెలియని వారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వారికి రాజ్యాంగ నిబంధనలేం తెలియవని, స్వార్థ ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని అడుగుతున్నారని అన్నారు. శానససభ సమావేశాలు జరుగుతున్నప్పుడే అవిశ్వాసం ప్రతిపాదిస్తారనే కనీస జ్ఞానం లేకుండా అవిశ్వాసం పెట్టు అని అడుగుతున్నారని విమర్శించారు.