చంద్రబాబు మంత్రివర్గం ఇదే...
posted on Jun 12, 2024 6:48AM
బుధవారం నాడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితోపాటే మరో 23 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. పవన్‌కళ్యాణ్‌తోపాటు మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.15 గంటల సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీగా వుంచారు. జనసేనకు మూడు మంత్రి పదవులు, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని కూర్చారు. సగానికి పైగా కొత్తవారికి అవకాశం లభించింది. మొత్తం 17 మంది కొత్తవారు మంత్రులుగా వుంటారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. ఎనిమిది మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీ ఒకరు, వైశ్యుల నుంచి ఒకరు, కాపులు నలుగురు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లు మంత్రివర్గంలో వున్నారు. సామాజికవర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. లోకేష్ మంత్రివర్గంలో చేరారు.
కొత్త మంత్రుల జాబితా
1. కొణిదెల పవన్ కళ్యాణ్ (కాపు), (పిఠాపురం)
2. నారా లోకేష్ (కమ్మ), (మంగళగిరి)
3. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ, కొప్పుల వెలమ), (టెక్కలి)
4. కొల్లు రవీంద్ర (బీసీ, మత్స్యకార), (మచిలీపట్నం)
5. నాదెండ్ల మనోహర్ (కమ్మ), (తెనాలి)
6. పొంగూరు నారాయణ (బలిజ), (నెల్లూరు)
7. వంగలపూడి అనిత (ఎస్సీ, మాదిగ), (పాయకరావుపేట)
8. సత్యకుమార్ యాదవ్ (బీసీ, యాదవ), (ధర్మవరం)
9. నిమ్మల రామానాయుడు (కాపు), (పాలకొల్లు)
10. ఎన్.ఎం.డి.ఫరూఖ్ (ముస్లిం మైనారిటీ), (నంద్యాల)
11. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి), (ఆత్మకూరు)
12. పయ్యావుల కేశవ్ (కమ్మ), (ఉరవకొండ)
13. అనగాని సత్యప్రసాద్ (బీసీ, గౌడ), (రేపల్లె)
14. కొలుసు పార్థసారథి (బీసీ, యాదవ), (నూజివీడు)
15. డోలా బాల వీరాంజనేయస్వామి (ఎస్సీ, మాల), (కొండపి)
16. గొట్టిపాటి రవికుమార్ (కమ్మ), (అద్దంకి)
17. కందుల దుర్గేష్ (కాపు), (నిడదవోలు)
18. గుమ్మిడి సంధ్యారాణి (ఎస్టీ), (సాలూరు)
19. బీసీ జనార్దనరెడ్డి (రెడ్డి), (బనగానపల్లె)
20. టి.జి.భరత్ (ఆర్యవైశ్య), (కర్నూలు)
21. ఎస్.సవిత (కురబ), (పెనుకొండ)
22. వాసంశెట్టి సుభాష్ (బీసీ, శెట్టి బలిజ), (రామచంద్రపురం)
23. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ, తూర్పుకాపు), (గజపతినగరం)
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రెడ్డి), (రాయచోటి)