వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. ఇప్పుడు జగన్ సర్కార్ ఏం చెబుతుందో?
posted on Jul 8, 2022 @ 2:21PM
రైతుల మోటార్లకు కరెంట్ మీటర్లు పెడితే నాణ్యమైన విద్యుత్ వస్తుందని ఏపీ ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రచారం చేసి మీటర్లు పెట్టేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పెట్టేశారు. ఇతర జిల్లాల్లో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. అయినా పట్టించుకోవడం లేదు. కానీ ప్రభుత్వం ఇలా రైతు మెడ మీద కత్తి పెట్టి మరీ వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు ఎందుకు బిగిస్తోందో ఎవరికీ తెలియని రహస్యం కాదు. అలా బిగిస్తే రుణాలు అందుతాయని కేంద్రం చెప్పడం వల్లే. అయితే ఈ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.
రైతుల మోటార్లకు కరెంట్ మీటర్లు పెడితే నాణ్యమైన విద్యుత్ వస్తుందని ఏపీ ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రచారం చేసి మీటర్లు పెట్టేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పెట్టేశారు. ఇతర జిల్లాల్లో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. అయినా పట్టించుకోవడం లేదు. కానీ ప్రభుత్వం ఇలా రైతు మెడ మీద కత్తి పెట్టి మరీ వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు ఎందుకు బిగిస్తోందో ఎవరికీ తెలియని రహస్యం కాదు. అలా బిగిస్తే రుణాలు అందుతాయని కేంద్రం చెప్పడం వల్లే.
రైతుల్లో వ్యతిరేకత తెస్తుందని భావించినా వ్యవసాయ మీటర్ల విషయంలో ముందుకే వెళ్లారు. మీటర్లు పెట్టి ఊరుకోరనీ, వినియోగించిన విద్యుత్ కు బిల్లులు వేస్తారనీ విపక్షాలు విమర్శిస్తే ఔను బిల్లులుస్తాం కానీ .. డబ్బులు రైతులకు నగదు బదిలీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. జీతాల కోసం ప్రతీ నెలా అప్పు చేయాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ప్రతి నెలా ఠంచన్‌గా బిల్లులు ఇస్తుందంటే రైతుల్లోనూ నమ్మకం కలగడం లేదు. అయినా ప్రభుత్వం వారి నమ్మకాలతో పని లేకుండా ముందుకే వెళుతోంది. కేంద్రంపై భక్తి? జగన్ ప్రభుత్వాన్ని అలా నడిపించింది.
అయితే ఇప్పుడు కేంద్రమే విద్యుత్ మోటార్లకు మీటర్లు వద్దని యూటర్న్ తీసుకుంది. అలా ఎందుకు తీసుకుందంటే వ్యవసాయ మీటర్లకు మోటార్లు బిగించడాన్ని రాష్ట్రంలో అత్యధిక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎక్కువ ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక కేంద్ర మోటార్ల విషయంలో వెనక్కు తగ్గింది.
ముందు వెనుకలు ఆలోచించకుండా కేంద్రం చెప్పింది.. చేసేస్తున్నాం అన్న చందంగా జగన్ సర్కార్ వ్యవసాయ మీటర్ల విషయంలో ముందుకే సాగడంతో ఇరుకున పడింది. బీజేపీ పాలిత రాష్ట్రాలే వ్యతిరేకించిన కేంద్రం విధానాన్ని జగన్ సర్కార్ ఆఘమేఘాల మీద ఆచరణలో పెట్టేసింది. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది. విద్యుత్ సంస్కరణల్లో మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిబంధన తొలగిస్తున్నట్లుగా కేంద్ర స్పష్టం చేసేసింది.
మోటార్లకు పెట్టే బదులు ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర మీటర్లు పెడితే చాలని కేంద్రం నిబంధన మార్చడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయం వల్ల ఇబ్బందుల్లో పడేది ఏ ఇతర రాష్ట్రం కన్నా ఏపీ మాత్రమే. ఎందుకంటే పొరుగున ఉన్న సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణ మీటర్ల విషయంలో ససేమిరా అంటూ కేంద్రాన్ని వ్యతిరేకించి నిలబడితే.. జగన్ సర్కార్ మాత్రం జీ హుజూర్ అంటూ కేంద్రం ముందు సాగిల పడింది.
రాజును మించిన రాజభక్తి ప్రదర్శించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకించిన విధానాన్ని భుజాన వేసుకుని మరీ సమర్ధించింది. మీటర్లతో రైతులకు మేలనే వాదనను వినిపిస్తూ వచ్చింది. మీటర్లు మేలు అంటూ కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసిన నోటితోనే ఇప్మీపుడు మీటర్లు అవసరం లేదని చెప్పాల్సిన పరిస్థితిని జగన్ సర్కార్ కొని తెచ్చుకుంది.