రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీంలో కేంద్రం సవాల్
posted on Nov 17, 2022 @ 11:23PM
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు ఆరుగురినీ విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం సవాల్ చేసింది. ఈ మేరకు దోషుల విడుదలకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేస్తూ తగిన వాదనలు వినిపించే అవకాశం లేకుండా ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనే అవుతుందని కేంద్రం తన పిటిషన్ లో పేర్కొంది.
రాజీవ్ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు- నళిని, మురుగన్, సంథాను, రాబర్డ్ పయాస్, జయకుమార్‌లకు జైలు నుంచి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్ట్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.
ఏ ఇతర కేసులూ లేకుంటే దోషులందరినీ విడుదల చేయవచ్చునని పేర్కొంది.ఈ తీర్పుతో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దోషులంతా జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.