పంజరంలో చిలక సిబిఐ, రంగు కాషాయం.. సిబల్
posted on Aug 20, 2022 @ 2:08PM
ఒక జానపద కథ.. ఒక కోడి పొరపాటున రంగునీళ్లున్న తొట్టిలో పడి క్షణం తర్వాత బయటపడింది. తర్వాత ఈకల రంగు మారిందని గ్రహించి ముందు భయపడుతుంది. ఆనక ఆ రంగుల ఈకల కోడి అన్ని పక్షల మీదా అజమాయిషీ చేస్తుంది. ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. ‘పంజరంలో చిలుక’ సీబీఐ ఇప్పుడు బయటకు వచ్చిందని, దాని ఈకలు కాషాయ రంగు లో ఉన్నాయని అన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ విధానం అమలు లో అక్రమాలు జరిగినట్లు ఆరో పిస్తూ సీబీఐ శుక్రవారం 20 చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కపిల్ సిబల్ స్పందిస్తూ శనివారం ఓ ట్వీట్ చేశారు. సీబీఐ పంజరంలో చిలుక వంటిదని సుప్రీంకోర్టు 2013లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సీబీఐ, ఒకప్పుడు ‘పంజరంలో చిలుక’ఇప్పుడు పంజరం నుంచి బయటపడింది.ఇప్పుడు దాని ఈకలు కాషాయ రంగులో ఉన్నాయి. దాని రెక్కలు ఈడీ అది తన యజమాని చెప్పిన మాటలను పలుకుతుంది! అని కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎదుగుతున్నారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ని అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోం దని కపిల్ ఆరోపించారు.
ఇదిలావుండగా, మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలపై కాంగ్రెస్ స్పందిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిం ది. ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానం అమలులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సిసోడియా ఇంట్లో సీబీఐ శుక్రవారం(ఆగష్టు 19) దాదాపు 15 గంటల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమ మహమ్మద్ శనివారం మాట్లాడుతూ, ఎక్సయిజ్ విధానం అమలులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు అల్కా లాంబా , అభిషేక్ దత్ కూడా ఇదే డిమాండ్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్ అంతకుముందు మాట్లా డుతూ, బూటకపు కంపెనీలకు లిక్కర్ లైసెన్స్‌లను చట్టవిరుద్ధంగా పంపిణీ చేస్తున్నారని, కోట్లాది రూపాయల కుంభకోణం జరు గుతోందని జూన్ నెలలో అప్పటి ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందన్నారు.
ఇదిలా వుండగా, తన వద్ద నుంచి తన కంప్యూటర్, ఫోన్, కొన్ని దస్తావేజులను సీబీఐ తీసుకెళ్లిందని మనీశ్ సిసోడియా చెప్పారు. తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయని ఆరోపించారు. తదుపరి ప్రశ్నించేందుకు తనను సీబీఐ పిలవలేదన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతోనే...ఢిల్లీ ఎక్సయిజ్ విధానం 2021-22ను అమలు చేయడంలో అక్రమాలు జరిగాయని, దీనిపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవ ర్నర్ వీకే జక్సేనా ఆదేశించడంతో సీబీఐ దాదాపు 20 చోట్ల సోదాలు నిర్వహించింది. మనీశ్ సిసోడియా ఇంట్లో దాదాపు 15 గంటలపాటు సోదాలు జరిగాయి.