కావేరి జలాలపై సుప్రీంకోర్టు.. మేం చెబితే చేయాల్సిందే..
posted on Sep 12, 2016 @ 12:35PM
ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నీటి జలాల వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య ఈ నీటి వివాదం ఉద్రిక్తంగా మారింది. మాటల యుద్దాలు పెరిగాయి. అయితే ఇప్పుడు.. దీనిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక జలాలు.. తమిళనాడుకు విడుదల చేయటం వల్ల తమ రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందని, తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కర్ణాటక సర్కారు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించి కోర్టు కర్ణాటక సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలు కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని, తమిళులైనా, కన్నడిగులైనా తామంతట తాము చట్టంగా వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. రెండు రాష్ట్రాలూ చట్టాన్ని గౌరవించాలని, తాము ఎన్నో ఆలోచించే ఆదేశాలు జారీ చేస్తామని.. సుప్రీంకోర్టు చెబితే వినాలని నిరసనలకు దిగుతూ సాధారణ ప్రజా జీవనాన్ని ఇబ్బందులు పెడుతున్నవారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. అయితే గత తీర్పులో తమిళనాడుకు 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తీర్పు ఇవ్వగా.. దానిని సవరిస్తూ 12 వేల క్యూసెక్కుల నీటిని ఇవ్వాలని ఆదేశించింది.