రాజగోపాల్‌రెడ్డి సంస్థనుంచి నగదు బదిలీ...ఈసీ కి ఫిర్యాదు
posted on Oct 30, 2022 9:13AM
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీ నుంచి మునుగోడు నియోజకవర్గంలోని పలువురు వ్యక్తులు, కంపెనీలకు రూ. 5.2 కోట్లు ఇటీవల బదిలీ అయినట్లు టీఆర్‌ఎస్ ఆరోపించింది. ఈ నగదు బదిలీలపై దర్యాప్తు చేయాలంటూ టిఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రకరకాలు వ్యాపారాలు చేస్తున్నవారికి, తమ కంపెనీతో ఎలాంటి సంబంధం లేనివారికి లక్షల్లో నగదు బదిలీ అయిందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో కంపెనీ నుంచి ఏయే మార్గల ద్వారా ఎవరెవరికి బదిలీ అయిందో తెలుపుతూ వివరాలు లేఖలో పొందుపర్చారు. వెంటనే ఆ ఖాతాలను జప్తు చేసి.. అక్కడి నుంచి నగదు బయటకు రాకుండా చూడాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిం ది. దీంతో ప్రధాన పార్టీలు గెలుపు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్దపడుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండటంతో... ప్రతీఓటూ కూడా పార్టీలకు కీలకంగా మారింది. ఏ ఒక్క ఓటును కూడా పార్టీలు వదులు కునేందుకు ఇష్టపడటం లేదు. ఓటు వేస్తాడని తెలిసినా, తెలియకపోయినా సరే ప్రతిఒక్కరికీ డబ్బులు పంచుతున్నట్లు చెబుతున్నారు. దీంతో మునుగోడులో ధనప్రవాహం ఏరులై పారుతోంది. అభ్యర్థులు డబ్బు, మద్యం విచ్చలవిడిగా దారబోస్తు న్నారు. కాంగ్రెస్ కొంచెం ఇందులో ఒక స్టెప్ వెనకుండగా.. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు మాత్రం ధారాళంగా ఖర్చు పెడుతు న్నారు.
ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారతీగా నగదు ఖాతాల్లోకి బదిలీ చేశారని టీఆర్ ఎస్ ఆరోపించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ తరహాలో భారీ నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని టిఆర్ ఎస్ నేత భరత్ కుమార్ పేర్కొ న్నారు. ప్రజాస్వామ్యంలో త తరహా చర్యలు సిగ్గుచేటని దుయ్యబట్టారు.