టిక్కెట్ మీద మ్యాచ్ టైమ్ తప్పు.. హెచ్‌సిఏ పై కేసు నమోదు
posted on Sep 28, 2022 @ 10:03AM
భారత్- ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ లో భాగంగా ఈ నెల 25న మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంట ర్నేషనల్ స్టేడియంలో జరిగింది. సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన టిక్కెట్ల అమ్మ కంలో జరిగిన తప్పిదాలు, తొక్కిసలాటల విషయంలో ఇపుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సి ఏ) పై కేసు నమోదయింది. మ్యాచ్ ఏడింటికి మొదలయింది. కానీ టిక్కెట్‌మీద మాత్రం మ్యాచ్ 7.30కి ప్రారంభమ వుతుందని ముద్రించారు. దీనిపై ఆగ్రహించిన ఒక యువకుడు బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఎంతో కాలం తర్వాత జరిగిన మ్యాచ్‌కి పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి చూపి టికెట్లకు ఎగబడ్డారు. ముందు ఆన్‌లైన్ లో అమ్మకాలు అన్నారు. తర్వాత విడిగా కూడా అమ్మకాలు ఉన్నాయ న్నా రు. ఆన్‌లైన్‌లో కేవలం గంటసేపట్లోనే టిక్కెట్లు అమ్మకాలు అయ్యాయని వార్తలు రావడంతో క్రికెట్ అభి మానులు ఆగ్రహించారు. తర్వాత అందులో సగమే అయ్యయని తర్వాత విడిగా అమ్మకాలు చేపట్టారు. అయితే ఇందులో కూడా పొరపాట్లు జరిగాయి.
టికెట్ల సమయంలో జరిగిన తొక్కిసలాటపై ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. తాజా ఫిర్యాదుతో హెచ్‌సీఏపై మొత్తం నాలుగు కేసులు నమో దు అయ్యాయి. టిక్కట్లమీద మ్యాచ్ సమ యం గురించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. టిక్కెట్ల సమయంలో జరిగిన తొక్కిస లాట లో చాలామంది గాయపడ్డారు. హెచ్‌సిఏ టిక్కెట్ల విక్రయానికి తగిన ఏర్పాట్లు చేయలేదని, నియం త్రణా లోపాలున్నాయని చాలామంది ఇప్పటికీ మండిపడుతున్నారు.