కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే మశ్చేంద్రరావు కన్నుమూత
posted on Jan 27, 2024 @ 11:16AM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేంద్రరావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అల్వాల్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1978-83లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందించారు. ఆయన మరణవార్త విని పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. కంటోన్మెంట్ ప్రజలు ఆయన సేవలను ఎప్పటికీ మర్చిపోలేరని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం రాజకీయాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అల్వాల్ శ్మశాన వాటికలో నేడు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.మశ్చేంద్రరావు తను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో జనాదరణ పొందారు.1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది జనతాపార్టీ. అప్పుడు మొరార్జీ దేశాయ్ దేశంలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు.ఆ తరువాత రెండేళ్ళకు అంతర్గత కలహాలతో జనతా ప్రభుత్వం కూలిపోయింది. జనతా పార్టీలో చీలికలు వచ్చి మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ వర్గాలుగా విడిపోయింది,