Read more!

అంకెల్లో తెలంగాణ పోలింగ్

 

 

 

ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణలోని మొదటి విడత పోలింగ్ జరగబోతోంది. పది జిల్లాలోని 17 పార్లమెంటు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు 4 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 162 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. రాష్ట్రానికి చెందిన 1,40,000 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు.

 

మొత్తం 30,518 పోలింగ్ స్టేషన్లకు గాను 12 వేల పోలింగ్ స్టేషన్లలను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. ఈ ఎన్నికలలో 2 కోట్ల 81 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరిలో 1 కోటి 37 లక్షల మంది మహిళా ఓటర్లు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు 265 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. 119 అసెంబ్లీ స్థానాలకు 1669 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కొన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.  ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 126 కోట్ల రూపాయలు, 74 కిలోల బంగారి, 708 కిలోల వెండి, 4,50,000 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల భద్రతకి సంబంధించి ఫిర్యాదు చేయదలచుకుంటే 1950 టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.