నన్ను అలా పిలవండి.. కానీ పాకిస్థానీ అనొద్దు..
posted on Aug 20, 2016 @ 12:42PM
నన్ను కుక్క అని అయినా పిలవండి కానీ... పాకిస్థానీ అని అనొద్దు అని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా..? వివరాల ప్రకారం.. 25 ఏళ్ల బలూచిస్థాన్ శరణార్ధి మజ్దక్ తన భార్యతో కలిసి న్యూఢిల్లీకి వచ్చాడు. ఈ నేపథ్యంలో తన పాస్ పోర్టును చూసిన అధికారులు తన జన్మస్థలం పాకిస్థాన్ లోని క్వెట్టా అని ఉండటంతో ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. ఇక ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన మజ్దక్.. తనను కుక్క అని అయినా పిలువండి కానీ పాకిస్థానీ అని అనొద్దని అధికారులతో అన్నట్లు తెలిపాడు. తాను బలూచ్ వాసినని తాను అక్కడ పుట్టినందుకు ఎన్నో వేధింపులకు గురయినట్లు తెలిపాడు. బలూచిస్థాన్ కు చెందిన వేలమంది ప్రజలు విదేశాలకు తరలివెళ్లారు. బలూచిస్థాన్ వాసులని పాకిస్థాన్ ఆర్మీ వేధింపులకి గురిచేస్తోందని.. తన తండ్రిని కూడా అపహరించి చంపేసిందని.. తల్లిని కూడా ఎన్నోరకాలుగా హింసించిందని తెలిపాడు. అంతేకాదు బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతోన్న ఘోరాలపై మాట్లాడినందుకు ఆయన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపాడు.