కన్న బిడ్డను బ్లేడ్ తో కోసేసింది! రంగారెడ్డి జిల్లాలో కసాయి తల్లి
posted on Feb 16, 2021 @ 10:20AM
అమ్మంటే దేవతకి ప్రతిరూపం అంటారు. అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఎక్కడా ఉండదంటారు. బిడ్డలను లాలించి, ప్రేమించడమే అమ్మలకు తెలుసు. కానీ ఓ తల్లి మద్యం మత్తులో కసాయిగా మారింది. కన్నకొడుకుపైనే కిరాతకంగా వ్యవహరించింది. పీకల దాకా మద్యం తాగిన ఆ మహా తల్లి... మద్యం మత్తులో, ఏం చేస్తుందో కూడా స్పృహ లేకుండా కుమారుడిపై బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిందీ ఈ దారుణ ఘటన.
రంగారెడ్డి జిల్లా హైదర్షాకోట్ మండలం గంధంగూడలో తాగిన మైకంలో ఓ తల్లి కుమారుడిని బ్లేడ్‌తో విచక్షణారహితంగా కోసి గాయపర్చింది. గాయాల బాధను బరించలేని బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెళ్లారు. అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను అడ్డుకుని, బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా తల్లి మద్యం మత్తులో ఉండే ఈ ఘాతుకానికి పాల్పడ్డినట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించారు. దాడికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.