బడ్జెట్- రహదారుల కోసం కోట్లకి కోట్లు!
posted on Feb 29, 2016 @ 11:01AM
దేశంలో మౌలిక సదుపాయాలను కల్పించడం తన తొలి ప్రాధాన్యతలలో ఒకటని పేర్కొన్ని జైట్లీ తదనుగుణంగా కేటాయింపులను అందచేస్తున్నారు.
- రహదారులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 70,000 ప్రాజెక్టులలో 85 శాతం ప్రాజెక్టును తిరిగి పట్టాల మీదకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మంత్రిగారు.
- కేవలం రహదారుల అభివృద్ధి కోసమే 97,000 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు తెలిపారు.
- రహదారి మీద రవాణాకు సంబంధించిన ‘మోటారు వాహనాల చట్టం’లో యాజమాన్య హక్కులకు సంబంధించి తగిన మార్పులను చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
- రాష్ట్రీయ రహదారులకు సంబంధించిన 50,000 కిటోమీటర్ల మేర రహదారులను జాతీయ రహదారులుగా మార్చనున్నట్లు ప్రకటించారు.