అత్యాశ .. వృధా ప్రయాస!
posted on Oct 8, 2022 @ 2:40PM
ఇక్కడే ఉండి ఏదన్నా చేసుకో నగరానికి వెళ్లి ఏం వెలగబెడతావ్? అంటుంది బామ్మ మనవడి హైదరా బాద్ ఉత్సాహాన్ని చల్లబరుస్తూ. చిన్నోచితకో ఉన్నవూళ్లో చేసుకుంటే బాగుంటుందేగాని ఎవ్వరూ తెలీని నగరానికెళ్లి ఉద్ధరించేదేవిట్రా పిచ్చి సన్నాసీ! అని ఆమె మొట్టికాయ హెచ్చరిక. అయినా సాధించు కొచ్చే తెలివి ఉన్నపుడు ఉన్నవూళ్లోనే కూర్చుంటే ఎలా అంటాడు ఎన్టీఆర్‌లా! కానీ ..! ఇదుగో ఇంత అనాలో చితం బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కేంద్రంలో పాగా వేసే ప్రయత్నం అంటున్నా రంతా.
చిన్నరాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి రావడం ఒక ఎత్తు. కానీ అదే ధీమాతో నలుగురినీ చేర్చుకుని కేంద్రా నికి గాలం వేయాలనుకోవడమే తొందరపాటు చర్యే అవుతుంది. ఎందుకంటే ఆ మద్ద తునిచ్చే స్నేహితులు ఎంత స్నేహంగా ఉంటారన్నది భవిష్యత్తుకి ఉపకరిస్తుంది. కారణం చిన్న రాష్ట్రాల నుంచి ఎదిగి కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్నవారిలో పెద్దగా విజయం సాధించింది కేవలం సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. తెలుగు దేశం పార్టీ స్థాపించి, అందరి మద్దతూ కూడగట్టుకుని కేంద్రానికి తనసత్తా చూపిన శక్తిమంతుడు ఆయన.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణా ముఖ్యమంత్రిగా, టీఆర్ ఎస్ అధినేతగా కేసీఆర్ తెలంగాణాలో చక్రం తిప్పడం సాగింది. కానీ అదే ధీమా తో ఇంకెన్నాళ్లీ బతుకు అన్నట్టుగా కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా కేంద్రానికి గాలం వేసి పార్టీ పేరును బీఆర్ ఎస్ అంటూ మార్చి ఉద్యమించడానికి సిద్ధపడ్డారు. అయితే ఉద్యమాల పార్టీగా టీఆర్ ఎస్‌ను స్థాపించి తెలంగాణా సాధించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన సత్తా, అప్పటి పరిస్థితులకు ప్రస్తుతం రాజకీయపరిణామాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. తెలంగాణాలోనే టీఆర్ ఎస్ పట్ల ప్రస్తుతం పెద్దగా వీరాభిమానం ప్రదర్శించే ప్రజాభిమానం అంటూ లేదు. పరిపాలన, పథకాల అమలు అన్నింటా టీఆర్ ఎస్ పెద్దగా ప్రజాదరణను చూరగొనలేదు. అందరూ వ్యతిరేకించడం ఆరంభమయింది. పైగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణాల్లో పాత్ర ఉందన్న ఆరోపణలూ ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో అన్నింటి నుంచీ తప్పిం చుకుని కేందరాజకీయాల్లో బిజీ అయిపోవాలన్న ఆలోచనతోనే రాష్ట్ర పరిస్థితులను, రాజకీయా లను దూరం చేసుకుంటున్నార్న అపవాదు కట్టుకున్నారు కేసీఆర్.
బీఆర్ ఎస్ అంటూ పార్టీ పేరు మార్చుకున్నంత మాత్రాన ప్రత్యేకించి ఆయనకు గాని, పార్టీకి గాని ఒరిగే దమీ ఉండదని విశ్లేషకుల మాట. కేవలం బీజేపీ వారి దాడిని ఎదుర్కొనడానికి కేసీఆర్ ఆ నిర్ణయం తీసు కున్నారు. తెలంగాణాలో ఎలాగ యినా పాగా వేయాలని, వీలయితే కుర్చీ నుంచి కేసీఆర్ ను తోసేయా ల న్న పట్టుదలతోనే బీజేపీ అన్ని శక్తులూ ఒడ్డుతోంది. కానీ ఇక్కడ కంటే అటునుంచే నరుక్కురావలన్న ధోరణిలోనే కేసీఆర్ ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు ఆశించి ప్రయాణాలుకట్టారు. కానీ వాస్తవానికి ఎవ్వరూ ఆయనకు ప్రత్యేకించి మద్దతుగా నిలుస్తామని, ముందుకు అడుగువేయమని హామీ ఇవ్వలేదు. కానీ తను మాత్రం పంతంతో పార్టీ పేరు మార్చి రంగంలోకి తానే దిగారు కేసీఆర్.
గతంలో ఇంత పెద్ద ప్రయత్నం చేసిన ఎన్టీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు కొంతవరకూ విజయం సాధించారే గాని రాష్ట్రరాజకీయాలను, ప్రజల ఆకాంక్షలను గాలికి వదిలేసి తన లక్ష్య సాధన అంటూ ఉట్టికి తాడు వేయలేదు. అప్పట్లో కాంగ్రెస్‌ను ఎదిరించడానికి, గద్దె దింపడానికి ఏర్పాటయిన కూటమికి చంద్రబాబు మద్దతు కోరడం, కన్నీనర్‌గా ఆయన వ్యవహరించడం తెలిసిందే. రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్ననాయకునిగా ఆయన్ను అందరూ ఎంతో గౌరవించారు. ఆయన కేంద్ర రాజకీ యాల్లో చక్రం తిప్పగలిగారు. కానీ కేంద్ర పదవులు, ప్రత్యేకతలు ఆశించలేదు. ఎన్‌డిఏ కూటమి ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినే ఆశించారు.
చంద్రబాబు 1980వ దశాబ్దం చివర్లో ఆయన ఎన్ టి రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ రాజకీ యాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా మారి కాంగ్రెస్ సహకారంతో దేవెగౌడ, గుజ్రాల్ లను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. 1998లో ఎన్.డి.యే. కన్వీనర్ గా మారి ఢిల్లీలో చక్రం తిప్పి అటల్ బిహారీ వాజ్ పాయి ప్రధాని కావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్ప టి ఎన్.డి.యే.లో చంద్రబాబు ప్రభావం చాలా బలంగా వుండేది. బాబు సూచనల మేరకే 2004లో వాజ్ పాయి ముందస్తు ఎన్ని క లకు సిధ్ధం అయ్యారని కూడా చెపుతారు. చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వివాదం, రాష్ట్రానికి నిధుల కేటా యింపు అంశాల్లో మొదలయి క్రమంగా రాజకీయ విధానాల వరకు విస్తరించింది. మోదీ విధా నాలను విమర్శించడంలో చంద్రబాబు జాతీయ నేతలు అందర్నీ మించి పోయారు. కర్ణాటక ఎన్నికల నుండే కాంగ్రెస్ కు దగ్గరయిన చంద్రబాబు యూపియే శిబిరంలో అప్రకటిత కన్వీనర్ గా వున్నారు. అంతకుమించి, బీజేపీ హయాంలోనే అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి చేయాలని బీజేపీ ఆలోచన చేసినపుడు ఆ ప్రతిపాదనకు ముందుగా మద్దతు నిచ్చింది అప్పటి సమైక్య ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబే. అలిపిరిలో చంద్రబాబు ప్రమాదానికి గురయి ఆస్పత్రిలో ఉన్నప్పుడు రాష్ట్రపతి హోదాలో ఉన్న కలామ్ వచ్చి పలకరించడం గమనార్హం.
కానీ కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ ఎస్‌ను అడ్డుపెట్టుకుని కేంద్రానికి ఎగబాకా లనే అనుకుంటున్నారు. కానీ బీజేపీయేతర రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరి మద్దతూ లభించలేదు. ఇటీవల కలిసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కూడా వాస్తవానికి కేసీఆర్‌తో ముందడుగు వేయడానికి ఆసక్తి ప్రద ర్శించడం లేదు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయి, రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆకాం క్షలను, సమస్యల్ని గాలికి వదిలేసి కేంద్రంలో నిలదొక్కుకోవాలన్న స్వార్ధ ప్రయోజనాలతో కేసీఆర్ కొత్త రాజకీయ ప్రయాణానికి ఉపక్రమించారు. ఇక్కడే ఒక్క విషయం స్పష్టమవుతుంది. కేసీఆర్ స్వార్ధ ప్రయో జనాలకు రాష్ట్ర అభివృద్ధిని, ప్రజాసంక్షేమాన్ని వదిలేశారు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు నాయకుడు మాత్రం కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు వచ్చినప్పటికీ నిస్వార్ధంగా వ్యవ హరించారు. ఆయనకు రాష్ట్ర ప్రగతి, ప్రజాసంక్షేమం కీలకంగా అనిపించాయి. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుంచాలన్న గొప్ప ఆలోచనతోనే అందివచ్చిన అవకాశాన్ని కాదనుకున్నారు.