త్వరలో బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా
posted on May 17, 2023 @ 4:13PM
బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు త్వరలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఆయన బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. బిఆర్ఎస్ ఎంఎల్ఏ, ఎంఎల్సి, ఎంపీలతో పాటు పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, స్టేట్ కార్పోరేషన్ చైర్ పర్సన్స్ తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని విస్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి బిజెపి ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ బిజెపికి అభ్యర్థుల కొరత ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆ సమస్య లేదు. ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించే పార్టీలతో కెసీఆర్ ఆపన్న హస్తం అందించే అవకాశం ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ మూడు నెలల ముందు అంటే సెప్టెంబర్ లో బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు బిఆర్ఎస్ మీద చూపే ప్రభావం మీద కూడా కెసిఆర్ చర్చించారు.
2018 అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేయాలని కెసీఆర్ చూస్తున్నారు. వాస్తవానికి 2019 ఏప్రిల్, మే లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ జరుగలేదు. 2018 సెప్టెంబర్ 6న కెసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. 2018 డిసెంబర్ లో ఎన్నికల్లో వెళ్లారు కెసిఆర్. ఇది వర్కవుట్ అయ్యింది కాబట్టి అప్పట్లో మొత్తం 119 సీట్లకు గానూ 88 సీట్లతో మళ్లీ అధికారంలో రాగలిగింది బిఆర్ఎస్.