కేసీఆర్ పెర్షియన్ వద్దనుకున్నారా?
posted on May 4, 2023 @ 4:04PM
బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఢిల్లీలో స్వంత భవనం నిర్మించుకుంది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలాన్ని అందుబాటులో తేవడానికి కేవలం 20 నెలల సమయమే పట్టింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న బీఆర్ఎస్ ఇప్పటి వరకు అద్దె భవనంలో కొనసాగింది. ప్రస్తుతం ఉన్న స్వంత భవనం విభిన్నంగా ఉంది. ఇంతకుమునుపు తెలంగాణలో బీఆర్ఎస్ నిర్మించిన భవనాలు పెర్సియన్ స్టైల్ లో ఉండేవి. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయం కావొచ్చు. తెలంగాణా సచివాలయం పెర్సియన్ స్టైల్లో కట్టినవే. ముస్లింలు అత్యధికంగా ఉన్న హైదరాబాద్ లో పెర్షియన్ స్టైల్ ఉంటే ప్రజల ఆదరాభిమానాలు చూరగొనొచ్చు కానీ ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్ భవనం పెర్షియన్ స్టైల్ లో లేదు. నాలుగు ఫోర్ల ఈ భవనం పూర్తి వాస్తుతో నిర్మించారు. ఉత్తర భారతంలోఈ స్టైల్ చెల్లు చీటి అని కేసీఆర్ ముందే గ్రహించి పెర్షియన్ స్టైల్ ఆలోచన ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. సాంప్రదాయ పూజలు నిర్వహించారు. ఈ భవన నిర్మాణ సమయంలో కేసీఆర్ పూర్తి వాస్తు నియమ నిబంధనలు పాటించారు. కేసీఆర్ కు ముందు నుంచి వాస్తుకు ప్రాధాన్యతనిస్తారు. ఈ భవన నిర్మాణ సమయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కేసీఆర్ ఢిల్లీలోని వసంత్ విహార్ కు వచ్చి వాస్తు దోషాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. వాస్తు దిశగా నిర్మాణం జరగాలని తగిన సూచనలు చేసేవారు. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వాస్తు నిపుణులను ఢిల్లీకి రప్పించుకుని నిర్మాణ పనులను పర్యవేక్షించేవారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ వాస్తు విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. 2024 లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజేపీ యేతర ఫెడరల్ ఫ్రంట్ తీసుకురావడానికి కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.