పీపీఈ కిట్ తో వధువు.. కోవిడ్ పాజిటివ్ వరుడు..
posted on Apr 26, 2021 @ 11:00AM
కళ్యాణం వచ్చిన కకొచ్చిన ఆగదంటారు. ఈ వార్త చదివాకా మీరు కూడా అవును అని ముక్కుమీద వేలు వేసుకుంటారు. అతని పేరు శరత్ మన్. ఆమె పేరు అభిరామి. వారిద్దరికీ పెద్దలు పెళ్లి కుదిర్చారు. ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి పత్రికలు వేయించారు. బంధు మిత్రులకు అందరికి ఆహ్వానం అందించారు. అంతా అనుకున్నట్లు జరుగుతుందని రెండు కుటుంబాలు సంతోషించారు. త్వరలో ఏడు అడుగులు నడువబోతున్నాం. ఇన్నాళ్లు వేరుగా ఉన్న వాళ్ళు ఒక్కటి అవుతున్నామని ఆ ఇద్దరు మురిషిపోయారు. అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరగాలనుకున్నారు.
కట్ చేస్తే.. శరత్ మన్ కి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఒక్కసరిగా రెండు కుటుంబాలు నిశ్శబ్దం లో ఉండిపోయాయి. శరత్ మన్ చికిత్స తీసుకుంటున్నాడు. వారు ఇద్దరు ఏం అనుకున్నారో ఏమో. అభిరామి పీపీఈ కిట్ తో శరత్ మన్ దగ్గరికి వచ్చి తాళి కట్టించుకుంది. ఇప్పుడు వాళ్ళ పెళ్లి పిక్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ఈ సంఘటన కేరళలోని అళప్పుజ వైద్య కళాశాల జరిగింది.