ఆమ్యామ్యాల దందా ఆత్మహత్య దాకా తీసుకువచ్చిందా?
posted on Aug 16, 2012 @ 9:54AM
అథికారుల ఆమ్యామ్యాల దందా ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకునేంత తీవ్రమైన స్థితికి తీసుకువెళ్లింది. ఈ సంఘటన ప్రభుత్వ అథికారుల నిర్లక్ష్యం, బిల్లుల విషయంలో జాప్యం తేటతెల్లం చేస్తోంది. ఉన్నతస్థాయిలో బిల్లుల గురించి పర్యవేక్షణ అసలు ఉండదన్న విషయాన్ని ఈ సంఘటన చాటుతోంది. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణంలోని ఇరిగేషను ఈఈ కార్యాలయం సంఘటనకు వేదికైంది. జెరాక్స్ మిషను పెట్టుకుని వ్యాపారం చేసుకునే ప్రకాష్‌కు ఈ కార్యాలయం సుమారు 4.25లక్షల రూపాయల వరకూ బకాయిపడిరది.
ఈ బకాయి గురించి ప్రకాష్ అడిగినప్పుడల్లా రేపురా, ఎల్లుండరా అంటూ అథికారులు తెగ తిప్పేస్తుండేవారు. కొందరు ప్రకాష్ వద్దకు వచ్చి అసలు ఆమ్యామ్యాలు లేకుండా ఆ కార్యాలయంలో చిన్న ఫైలు కూడా కదలదని తేల్చిచెప్పారు. ఇదెంత వరకూ నిజమో అన్న విషయాన్ని ప్రకాష్ స్వయంగా పరిశీలించారు. అయితే అర్థికంగా జెరాక్స్ సెంటర్‌పై ఆథారపడే ప్రకాష్ తనకు స్తోమత లేదు కాబట్టి మంచిగా డబ్బులు వసూలు చేసుకోవాలని ప్రయత్నించారు. ఎంతకీ అథికారులు తమ వాయిదాపద్దతిని మానలేదు. దీంతో విసిగిపోయి ఆర్థికసమస్యలూ ఎక్కువ అవటంతో తట్టుకోలేకపోయిన ప్రకాష్ కిరోసిన్ తీసుకుని ఈఈ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం గదిలోకి వెళ్లాక ఇప్పటికైనా నా బిల్లు చెల్లించాలని కోరుతూ కిరోసిన్ శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నారు. హతాశులైన అథికారులు పోలీసుల సహాయంతో ప్రకాష్‌ను రక్షించే పనిలో పడ్డారు.