బ్రహ్మోత్సవం అప్‌డేట్స్:మహేశ్‌కు "రోను" గండం
posted on May 20, 2016 @ 4:35PM
నిన్న మొన్నటి వరకు అందరికళ్లూ బ్రహ్మోత్సవంపైనే. మహేశ్ శ్రీమంతుడిలా రికార్డులు సృష్టిస్తాడా..తన విన్నింగ్ కౌంట్ పెంచుకుంటాడా అంటూ కోటీ ఆశలతో ధియేటర్లలోకి అడుగుపెట్టిన ప్రేక్షకులకు బ్రహ్మోత్సవం నిరాశను మిగిల్చింది. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఏ సీన్ కూడా ప్రేక్షకులకు అర్ధం కాకపోవడంతో ఈ సినిమా పెద్ద డిజాస్టరయ్యింది. ఈ మ్యాటర్ పక్కనబెడితే బ్రహ్మోత్సవానికి మరో ముప్పు పొంచి ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై "రోన్" తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. కలెక్షన్లే టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోత్సవాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. సినిమా ప్లాప్ కావడంతో కనీసం పెట్టుబడి అయినా వస్తుందా..? అనుకుంటున్న నిర్మాతలకు "మూలిగే నక్కపై తాటికాయ పడిన "చందంగా రోన్ గట్టి దెబ్బ తీసింది. రెండు రోజుల నుంచి వర్షాలు ముంచెత్తుతుండటంతో చాలా ప్రాంతాల్లో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. రేపు, ఎల్లుండి రోను తగ్గుముఖం పడితే వీకెండ్ కాబట్టి కాస్త సేఫ్. లేదంటే మహేశ్ పరిస్థితి దారుణంగా తయారవ్వడం ఖాయం.