ప్రియుడికి హెచ్‌ఐవీ..హత్యకు ప్రియురాలు కుట్ర
posted on Jun 16, 2016 @ 4:46PM
వాళ్లిద్దరూ ప్రాణప్రదంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి, ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. అయితే ఒక నిజాన్ని ఆమె వద్ద దాయడం అతని ప్రాణాలమీదకు తెచ్చింది. అమెరికాలోని అరిజోనాలో సైకిల్‌పై వెళుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దాంతో అతడు కొన్ని అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. స్థానికులు పరుగుపరుగున వచ్చి ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగినప్పుడు దగ్గరలోని సీసీ కెమెరాలో మొత్తం సంఘటన రికార్డయ్యింది. ఫుటేజ్ ఆధారంగా మిస్టీ లీ అనే మహిళ ఆ రోజు కారు నడిపిందని గుర్తించారు. ఆమెను విచారించగా అసలు నిజం బయటపడింది. ఆ ప్రమాదం యాక్సిడెంటల్‌గా జరిగింది కాదని..ఆమె ఆ సైక్లిస్ట్ గర్ల్‌ఫ్రెండ్ అని పోలీసులు కనిపెట్టారు. అతడికి హెచ్ఐవీ ఉందని, ఆ విషయం తనతో చెప్పలేదనే ఆగ్రహంతోనే అతడిని హత్య చేయాలనుకున్నట్లు ఆమె అంగీకరించింది. విక్కీపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు.