దిమ్మతిరిగే బాబా బురిడి.. పరమాన్నం పెట్టి రూ 1.33 కోట్లతో జంప్..
posted on Jun 16, 2016 @ 4:03PM
రోజుకో దొంగ బాబా.. జనాల్ని బురిడీ కొట్టింటే బాబాల బయటకు వస్తున్నా జనాలు మాత్రం మారరు. గుడ్డిగా నమ్మేసి వారు చెప్పింది చేసేస్తుంటారు. ఇప్పుడు అలాంటి దొంగ బాబా ఉదంతమే ఒకటి బయటపడింది. తన మాటలతో నమ్మించి ఏకంగా రూ.1.33 కోట్ల నగదును దోపిడి చేశాడు.
వివరాల ప్రకారం.. ‘లైఫ్‌స్టైల్’ భవనం యజమాని మధుసూదన్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్నారు. అయితే ఆయనకు కర్ణాటకలో ఉన్న బాబా గురించి తెలుకొని.. ఇంట్లో పరిస్థితులు బాగుండకపోవడంతో అతని చేత పూజలు చేయిద్దామని అనుకన్నాడు.అనుకున్నట్టు గానే ఎలాగొలా తన బంధువుల సహాయంతో అతని వివరాలు తెలుసుకొని ఆహ్వానించాడు. నిన్న ఇక్కడికి వచ్చిన ఆయన కోసం ఓ లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ నుండి మధుసూధనరెడ్డి ఇంటికి చేరుకొని ఉదయం 11 గంటలకు పూజ ప్రారంభించాడు. పూజ కోసం ఓ ముగ్గు కూడా వేశాడు. మధుసూదన్‌రెడ్డి, ఆయన భార్య విద్యావతి(46), కుమారుడు సందేశ్‌రెడ్డి(28) పూజలో కూర్చున్నారు. పూజ ప్రారంభించిన కొద్ది సేపటికి ఇంట్లో ఉన్న సొమ్మంతా తీసుకొచ్చి ముగ్గులో పెట్టాలని చెప్పగా.. రూ 1.33 కోట్లు తీసుకొచ్చి పెట్టారు. ఇక ఆతరువాత సాయంత్రం నాలుగు గంటలకు పూజ అయిపోగా.. ఇంట్లో భోజనం చేయకూడదని చెప్పి.. తాను స్వయంగా చేసుకొచ్చిన పరమాన్నం.. తినమని వాళ్లకి ఇచ్చాడు. అంతే అది తిన్న వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే బాబాగారు డబ్బుతో ఉడాయించాడు.
ఇక ఆతరువాత మధుసూధన రెడ్డి బంధువులు వచ్చి వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యావతి, సందేశ్‌రెడ్డి కోలుకోగా మధుసూధనారెడ్డి ఐసియూలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.