కొత్త సినిమాలో బాలకృష్ణ రాజకీయం
posted on Jun 4, 2013 @ 4:15PM
గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ అటు రాజకీయాలకు, సినిమాలకు సెంటర్ పాయింటుగా మారారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఇంతకాలం గాసిప్ గా చెప్పుకుంటున్న బాలయ్య బోయపాటి హిట్ కాంబినేషన్ మూవీ అధికారికంగా తెరకెక్కి గాసిప్ కాస్తా న్యూస్ అయ్యింది. రాజకీయంగా వచ్చే ఏడాది కీలకం కావడంతో అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో తనను సెటిల్ చేసే సినిమా తీయాలనేది బాలయ్య ఆలోచన. అది బోయపాటి అయితేనే సాధ్యమని ఆయన భావిస్తున్నారు. దాదాపు తుడిచిపెట్టుకుపోయిందనుకున్న బాలయ్య సినీ జీవితాన్ని “సింహ” లాంటి భారీ విజయం ద్వారా మళ్లీ ఫాంలోకి తెచ్చాడు బోయపాటి.
ఇప్పుడు బోయపాటితో బాలయ్య మరో సినిమా ప్లాన్ చేశాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. సోమవారం మధ్యాహ్నం సినిమా ప్రారంభం అయ్యింది. సింహా తర్వాత అంచనాలు ఎలా ఉంటాయో తెలుసు. అయితే నా పరిధులు నాకుంటాయి. ప్రేక్షకులు సంతృప్తి పడే స్థాయిలో ఈ సినిమా తీస్తా అని చాలా సాఫ్టుగా చెప్పుకొచ్చారు బోయపాటి.