ఆప్షన్-1కి ...ఆప్షన్-2కి తేడా ఏముంది? అన్నీ విశాఖలోనే పెట్టాలన్నాక..!
posted on Jan 4, 2020 @ 9:31AM
పరిపాలనా వికేంద్రీకరణపై ప్రధానంగా రెండు ఆప్షన్లను సూచించిన బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్... ఎక్కడెక్కడ ఏమేమీ ఉండాలో డిటైల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. విశాఖలో ఏఏ కార్యాలయాలు ఉండాలి... అమరావతిలో ఏమేమీ ఉండాలి... అలాగే కర్నూలులో ఏమేమీ ఏర్పాటు చేయాలో క్లారిటీగా చెప్పింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలన్నీ మొదటి ప్రాధాన్యతా నగరమైన విశాఖలో ఉండేటట్టుగా చూసుకోవడం హేతుబద్ధమైందని బీసీజీ అభిప్రాయపడింది. అలా కాకపోతే, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోటు ఉండేలా చూసుకోవడం మంచిదని తెలిపింది. ఈ సూచనలతోపాటు ప్రధానంగా రెండు ఆప్షన్లను ప్రభుత్వం ముందు పెట్టింది బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్.
రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్... ప్రధానంగా రెండు ఆఫ్షన్లను ప్రభుత్వానికి సూచించింది. -(ఆప్షన్-1)-: విశాఖలో సచివాలయం... గవర్నర్, సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్స్.... ప్రభుత్వ కార్యాలయాలు... ఇండస్ట్రీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ శాఖలు... టూరిజం డిపార్ట్‌మెంట్.... అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ..... హైకోర్టు బెంచ్.... ఇక, అమరావతిలో అసెంబ్లీ... విద్యాశాఖకి సంబంధించి మూడు ప్రధాన కార్యాలయాలు... వ్యవసాయానికి సంబంధించి నాలుగు ప్రధానా కార్యాలయాలు... సంక్షేమం, స్థానిక సంస్థలకు సంబంధించి 8 ప్రధాన కార్యాలయాలు.... హైకోర్టు బెంచ్.... అలాగే, కర్నూలులో హైకోర్టు.... స్టేట్ కమిషన్లు.... అప్పిలేట్ సంస్థలు ఏర్పాటు చేయాలని ఆప్షన్-1లో సూచించింది. -(ఆప్షన్-2)-: విశాఖలో సచివాలయం... గవర్నర్, సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్స్.... అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు.... అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ..... హైకోర్టు బెంచ్... ఇక, అమరావతిలో అసెంబ్లీ... హైకోర్టు బెంచ్..... అదేవిధంగా, కర్నూలులో హైకోర్టు... స్టేట్ కమిషన్లు.... అప్పిలేట్ సంస్థలు ఏర్పాటు చేయాలని ఆప్షన్-2లో సూచించింది.
ఇదిలా ఉంటే, అసలు సచివాలయానికి ఎవరెవరు... ఏయే పనులపై వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారనే దానిపై బీసీజీ ఆసక్తికర విశ్లేషణ చేసింది. ఏడాది మొత్తంలో లక్ష మంది సచివాలయానికి వస్తే... అందులో అధిక శాతం సీఎం సహాయనిధి కోసమే వచ్చినట్లు తెలిపింది. ఇక, ఆ తర్వాత కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునే ఉద్యోగులు, పెండింగ్ బిల్లుల కోసం వచ్చేవాళ్లే ఎక్కువగా ఉన్నారని... అయితే, ఈ పనులన్నీ ఎక్కడికక్కడ ప్రాంతీయంగా జరిగేలా చూసుకుంటే సరిపోతుందని బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ సిఫార్సు చేసింది.