యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జిందాల్ ?
posted on Dec 23, 2013 @ 3:39PM
అమెరికా రాజకీయాల్లో ఎదుగుతూ వస్తున్న భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ ఆ దేశ అధ్యక్ష పదివికి పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రిపబ్లిక్ నాయకుడిగా లూసియానా గవర్నర్ విధులు నిర్వహిస్తున్నా జిందాల్...2016లో అధ్యక్ష పదివికి పోటీ పడతారని అంటున్నారు.
అమెరికన్ టీవి ఛానల్ సి-స్పాన్స్ న్యూస్ మేకర్ ఇంటర్వ్యూలో రిపబ్లికన్ పార్టీ సెనెటర్ డేవిడ్ విట్టర్ మాట్లాడుతూ..రజాదరణ గల బాబీ జిందాల్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగితే అందరూ సంతోషిస్తారని అన్నారు.అతని నాయకత్వంపై గౌరవం ఉందని తెలిపారు. రాజకీయాలకు కావాల్సిన అన్ని విలువలు జిందాల్‌కు ఉన్నాయని చెప్పారు. కానీ తనకు దాని గురించి ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియదని విట్టర్ తెలిపారు. అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు బరిలో ఉంటారంటే మాత్రం.. జిందాల్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ కూడా జిందాల్ అధ్యక్ష బరిలో నిలుస్తారనే భావిస్తున్నారని ఆయన తెలిపారు.