బన్సల్ నల్లధనం.. 30కి పైగా బ్యాంకు లాకర్లు..
posted on Oct 4, 2016 @ 12:31PM
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డైరెక్టర్ జనరల్ బీకే బన్సల్ ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బన్సల్ పరువు పోయిందన్న మనస్తాపంతో గత కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనితో పాటు తన కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికంటే ముందు అతని భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు బీకే బన్సల్‌కు ఏకంగా 30కి పైగా బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తాజాగా తేలింది. బీకే బన్సల్ ఆత్మహత్య చేసుకున్న రెండు రోజుల ముందే.. తమ వద్ద దాదాపు రూ. 2.4 కోట్ల నల్లధనం ఉందని ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలిపాడు. తర్వాత సీబీఐ వర్గాలు సెక్యూరిటీ కెమెరాలలో ఉన్న సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా మరో కొత్త విషయం తెలిసింది. బీకే బన్సల్‌ను అరెస్టుచేసిన మర్నాడు యోగేష్, ఆయన తల్లి బ్యాంకులకు వెళ్లి, మొత్తం 19 లాకర్లను తెరిచారు. దాంతో ఇప్పటికే భారీగా బంగారు, వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్న ఇంట్లో మరోసారి సీబీఐ వర్గాలు సోదాలు చేశాయి. అప్పుడే అక్కడ భారీ మొత్తంలో నల్లధనం దొరికింది.