బీజేపీ ఫైనల్ లిస్ట్ ఇదే!
posted on Nov 10, 2023 @ 9:57AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను బీజేపీ విడుదల చేసింది. 14 మందితో కూడిన తుది జాబితాను శుక్రవారం (నవంబర్ 10) ఉదయం అధిష్టానం ప్రకటించింది. నామినేషన్ల గడువు అదే తేదీతో ముగియనున్న సంగతి విదితమే.
ఈ నేపథ్యంలోనే బీజేపీ ఇప్పటి వరకూ పెండింగ్ లో పెట్టిన స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. బెల్లంపల్లి నుంచి కోయెల ఎమాజీ, పెద్దపల్లి నుంచి దుగ్యాల ప్రదీప్, సంగారెడ్డి నుంచి డి. రాజేశ్వరరావులను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. అలాగే మేడ్చల్ నుంచి ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్కాజ్ గిరి అభ్యర్థిగా రామచంద్రరావు, శేరిలింగంపల్లి క్యాండెట్ గా రవికుమార్ యాదవ్ లను ప్రకటించింది.
నాంపల్లి నియేజకవర్గానికి రాహుల్ చంద్రా, కంటోన్మెంట్ కు గణేష్ నారాయణ్, దేవరకద్ర నుంచి కొండా ప్రతాప్ రెడ్డిలను అభ్యర్థులు గా ప్రకటించింది. అలాగే నర్సంపెట్ కు పుల్లారావు, వనపర్తి నియోజకవర్గానికి అనూగ్నారెడ్డి, అలంపూర్ కు మీరమ్మ, చాంద్రాయణ గుట్ట నుంచి కే. మహేందర్ బీజేపీ అభ్యర్థులుగా రంగంలో నిలుస్తారని బీజేపీ పేర్కొంది.