కమలానంద విడుదల కోసం పిఎస్ వద్ద స్వామిజీల జాగారం
posted on Jan 17, 2013 @ 10:10AM
కమలానంద అరెస్ట్ ను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు రాత్రి నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కమలానంద ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకున్నా పోలీసులు అరెస్ట్ చేశారని వారు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గవర్నర్ ని కలిసేందుకు వెళ్ళిన హిందూ మత పెద్దలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి స్వామీజీలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకి దిగారు. కమలానంద భారతిని విడుదల చేసేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు.
రాత్రి నుండి ఆందోళన చేస్తున్న స్వామిజీలకు భారతీయ జనతా పార్టీ నేతలు, విశ్వహిందూ పరిషత్ నేతలు మద్దతు పలికారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి "కమలానంద మాట్లాడుతుండగా తాను అక్కడే ఉన్నానని, ఆయన ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు". ఆయనను వెంటనే విడుదల చేయాలన్నారు. స్వామిజీలకు మద్దతుగా భారీగా బిజెపి, విహెచ్‌పి కార్యకర్తలు తరలి వస్తున్నారు.