కేటీఆర్ పై బీజేపీ భగ్గు...
posted on Mar 12, 2021 @ 1:56PM
కమలనాధులు ముక్త కంఠంతో టీఆర్ఎస్ పార్టీతో పాటు.. మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు విమర్శలు గుప్పించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచిన తర్వాతనే కేసీఆర్ కుటుంబం విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడాలని కిషన్ రెడ్డి ఆంటే. కేటీఆర్ నిజంగానే గట్స్ ఉన్న నాయకుడైతే అజంజాహీ మిల్స్, నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెలిపించాలని బండి సంజయ్ మండిపడ్డారు. షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని టీఆర్ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిందన్నారు. ఏడేళ్ళుగా షుగర్ పరిశ్రమను ఎందుకు తెరవలేదో కేటీఆర్ చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కేటీఆర్‌కు పూనకం వస్తోందని ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవటానికి కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్నారు. 70శాతం ఫిట్‌మెంట్ ఇస్తామన్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీఆర్ఎస్‌కు ఓటు వేయరన్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ తన ఏడుపు తాను ఏడిస్తే బాగుంటుందని. విశాఖపట్నంలో వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేసుకుంటారని బండి సంజయ్ అన్నారు.