టీడీపీతో పొత్తుకు కమలనాథుల ప్లాన్!
posted on Apr 14, 2023 @ 3:11PM
దక్షిణాదిలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
AP, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మీద బీజేపీ నిఘా పెట్టింది. వచ్చే యేడాది లో పు సౌత్ లో బలం పెంచుకోవడానికి ప్లాన్ చేస్తోంది. వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. యిటీవలి అక్కడ మూడు పట్ట భధ్రుల రిజల్ట్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం మిగిల్చింది. అక్కడ టీడీపీ విజయకేతనం అన్ని పార్టీల్లో గుబులు పుట్టించింది. వచ్చే యేడాది రెండు రాష్ట్రాల్లో ELECTIONS నేపథ్యంలో తెలంగాణ, APలో తన బలం పెంచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో బలమైన అపోజిషన్ పార్టీగా యెదిగిన తెలుగు దేశంతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. సౌత్ లో తన బలం పెంచుకోవాలని చూస్తోంది. సౌత్ లో కీలకమైన తెలంగాణలో BRS వరుసగా రెండు సార్లు అధికారంలో వచ్చింది. కానీ వచ్చే యేడాది జరగనున్న ELECTONSలో BRS గెలిచే అవకాశాలు సన్నగిల్లాయి. అవినీతి పెరిగిపోయిందని అపోజిషన్ పార్టీలు నిరసిస్తున్నాయి. బీజేపీ రెండు రాష్ట్రాల్లో బలంగా అవతరించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడుతుంది. యింటిటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ ప్రజల్లో అభిమానాన్ని చూరగొంటుంది.
కాంగ్రేస్ రెండు రాష్ట్రాల్లో మూడో స్థానానికి దిగజారిపోవడంతో రెండు రాష్ట్రాల్లో బలమైన పార్టీగా అవతరించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కమలనాథుల యెత్తుగడ. తెలంగాణలో టీడీపీ ప్రెసిడెంట్ గా కాసాని నియామకం అయిన తర్వాత టీడీపీ జవసత్వాలు పెరిగాయి. వచ్చే నెల హైదరాబాద్లో నిర్వహించ తల పెట్టిన మహనాడులో పొత్తుల విషయమై చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. APలో వంటరిగా పోటీ చేసినా అధికారంలో రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం ద్వారా గెలుపు వోటములను నిర్ణయించే శక్తి టీడీపీకి వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి నష్టం వాటిల్లుతుందా అనే అంశం మీద మహనాడులో చర్చించనున్నారు. గ్రేటర్లో 14 స్థానాలను గెలిచే సత్తా టీడీపీకి వుంది. యునైటెడ్ రాష్ట్రంలో టీడీపీ తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొన్న సంగతి తెలిసిందే