12 మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల
posted on Nov 7, 2023 @ 12:14PM
నామినేషన్లకు గడువు మరో మూడు రోజులు ఉండటంతో బిజెపి నాలుగో జాబితాను విడుదల చేసింది. మరో 19 స్థానాలను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది. జన సేనకు 7 సీట్లు ఖరారయ్యాయి. భారతీయ జనతా పార్టీ 12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఆ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ప్రకటించిన మూడో జాబితాలో 35 మందికి చోటు కల్పించింది.
బీజేపీ నాలుగో జాబితా అభ్యర్థులు వీరే...
చెన్నూరు- దుర్గం అశోక్
ఎల్లారెడ్డి- వీ. సుభాష్ రెడ్డి
వేములవాడ- తుల ఉమా
హుస్నాబాద్- బొమ్మ శ్రీరామ చక్రవర్తి
సిద్దిపేట- దూడి శ్రీకాంత్
వికారాబాద్- పెద్దింటి నవీన్ కుమార్
కొడంగల్- బంటు రమేష్ కుమార్
గద్వాల- బోయ శివ
మిర్యాలగూడ- సాదినేని శ్రీనివాస్
మునుగోడు- చెలమల్ల కృష్ణారెడ్డి
నకిరేకల్- నకరకంటి మొగులయ్య
ములుగు- అజ్మీరా ప్రహ్లాద నాయక్