బీజేపీ సమరశంఖం: జోరుగా తెలంగాణ పోరుయాత్ర
posted on Jan 31, 2012 @ 10:02AM
కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర నిరాటంకంగా సాగుతోంది. కరీంనగర్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోరుయాత్ర విజయవంతంగా కొనసాగింది.ఐదు నియోజకవర్గాల్లో పర్యటించిన కిషన్‌రెడ్డి పలుచోట్ల ప్రసంగించారు
సోనియా గాంధీ నిర్లక్ష్యం వైఖరి కారణంగానే తెలంగాణాలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ చేపట్టిన తెలంగాణా పోరుయాత్ర ప్రశాంతంగా సాగింది. రామగుండం 5ఇంక్లెయిన్ గనిలో దిగిన కిషన్‌రెడ్డి సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. సింగరేణి కార్మికులను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని, సింగరేణిలో ప్రైవేటీకరణ అడ్డుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణా వాదాన్ని జాతీయ స్థాయివరకు తీసుకెళ్లిన ఘనత సింగరేణి కార్మికులదేనని కిషన్‌రెడ్డి అన్నారు. అనంతరం మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది.దారి పొడవునా ప్రజలు ఘనస్వాగతం పలకగా కిషన్‌రెడ్డి ఉత్సాహంగా ప్రసంగించారు.
గుజరాత్ తరహా అభివృద్ధి తెలంగాణాలో చేస్తామని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ నిర్లక్ష్య వైఖరివల్లే తెలంగాణాలో ఆత్మహత్యలు జరుగున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణా సాధించేవరకు కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని తెలంగాణా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. జోరుగా సాగిన పోరుయాత్ర కోరుట్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో మూడో రోజు యాత్ర సాగనుంది.