అవినాశ్ అరెస్ట్ వార్తలపై బెట్టింగ్ లు మామూలుగా లేవు
posted on Apr 26, 2023 @ 12:15PM
కోళ్ల పందేలు, క్రికెట్ పై బెట్టింగ్ ల గూర్చి విన్నాం. ఫలానా పార్టీ లేదా ఫలానా అభ్యర్థి గెలుపోటములకు సంబంధించి బెట్టింగ్లు కట్టడం మామూలే కానీ తెలుగునాట ఓ వింత బెట్టింగ్ లు ప్రారంభమయ్యాయి. అవి కూడా లక్షల్లో బెట్టింగ్ లు జరుగుతున్నట్టు వార్తలు అందుతున్నాయి.
అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వత ఇలాఖా కడపలో బెట్టింగులు జోరందుకున్నాయి..కొందరు ఆయనను అరెస్ట్ చేస్తారని కొందరు, చేయరంటూ మరికొందరు పందేలు కాస్తున్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంతో పాటు అవినాష్ రెడ్డి నివాసముండే పులివెందులలో కూడా బెట్టింగులు జరుగుతున్నట్లు తెలుస్తోంది..వేల రూపాయల నుంచి లక్షల రూపాయల మధ్య బెట్టింగ్లు నడుస్తున్నట్లు సమాచారం..
వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ అధికారులు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి, అతని అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు.