Read more!

చలికాలంలో గుమ్మడిగింజలు తింటే అద్భుతమైన ప్రయోజనాలు.!

శీతాకాలం ఆరోగ్యానికి చాలా సున్నితమైనది. ఈ కాలం ఆరోగ్యం విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉన్నా వ్యాధులు చుట్టుముడుతుంటాయి. మిగతా కాలాల కంటే శీతాకాలంలో ఆహారం విషయంలో చాగా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో గుమ్మడిగింజలు తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో  ఐరన్, ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం వంటి అనేక లక్షణాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిండచంతోపాటు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. శీతాకాలంలో గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.


షుగర్ పేషంట్లకు:

మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి వారి ఆహారంలో గుమ్మడి గింజలను చేర్చుకోవాలి . చలికాలంలో గుమ్మడి గింజలు తినడం వల్ల ఇన్సులిన్ నియంత్రణలో ఉండి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. గుమ్మడికాయ గింజలు చక్కెరను అదుపులో ఉంచుతాయి.

రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి:

గుమ్మడి గింజల్లో ఉండే లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో మేలు చేస్తాయి. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలకు సులభంగా దూరంగా ఉండవచ్చు.

గుండె ఆరోగ్యానికి:

గుమ్మడికాయ గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుతాయి. చలికాలంలో రక్తపోటు ఎక్కువగా ఉంటే గుమ్మడి గింజలు తినాలి.

బరువు తగ్గాలంటే:

చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. అలాంటి పరిస్థితుల్లో గుమ్మడి గింజలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఇందులో ఫైబర్, ప్రొటీన్లతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. గుమ్మడి గింజలు, ఐరన్, జింక్ మరియు విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టుకు మేలు చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది.

గుమ్మడికాయ గింజలను ఎలా తీసుకోవాలి?

వీటిని నేరుగా తినవచ్చు. అయితే, మీకు కావాలంటే, మీరు ఈ విత్తనాలను సలాగ్ లేదా ఫ్రూట్ చాట్‌లో ఉపయోగించవచ్చు. మీరు గుమ్మడికాయ గింజలను ప్రోటీన్ షేక్‌లో కూడా తినవచ్చు.