లాడెన్, బాబర్ వారసుడిని బొంద పెడ్తాం! కేసీఆర్ పై సంజయ్ ఫైర్
posted on Nov 9, 2020 @ 5:05PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ ను ఒక నియంతగా ఆయన అభివర్ణించారు. బీజేపీ అంటే ఛత్రపతి శివాజీ వారసులమని... కేసీఆర్ మాత్రం లాడెన్, బాబర్ వారసుడని విమర్శించారు. ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్ కు బొంద పెడతామని... హిందువులను అవమానిస్తున్న ఎంఐఎంకు బుద్ధి చెపుతామన్నారు బండి సంజయ్.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామన్నారు బండి సంజయ్. పేదల్లో కష్టాల్లో ఉన్నా పరామర్శించకపోవడం యనకు అలవాటుగా మారిందని చెప్పారు. వరదలకు బంగ్లాలు మునగలేదు కాబట్టే ఇంటి నుంచి కేసీఆర్ బయటకు రాలేదని విమర్శించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క ఇంటినీ సర్వే చేయాలని... బాధితులందరికీ నష్ట పరిహారాన్ని అందించాలని బండి డిమాండ్ చేశారు.
కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. బియ్యం, డబుల్ బెడ్రూమ్, రోడ్లు, టాయిలెట్లు, లైట్లు ఇలా అన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నా.. కేసీఆర్ మాత్రం అంతా తానే చేస్తున్నాననని డబ్బుా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ చీఫ్. మైలార్ దేవ్ పల్లిలో జరిగిన బీజేపీ సభలో పాల్గొన్నారు. ఈ సభలోనే కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి కమలం పార్టీలో చేరారు. ఇక సభకు వెళుతూ ఆరాంఘర్ నుంచి మైలార్ దేవ్ పల్లి వరకు భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు బండి సంజయ్.