చర్చకు సై.. భార్యా బిడ్డల మీద ప్రమాణం చేయాలంటూ సవాల్!
posted on Aug 9, 2025 @ 3:11PM
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం సవాళ్ల పర్వం నడుస్తోంది. కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ ను ట్విట్టర్ టిల్లుగా అభివర్ణించారు. చేసిన అన్యాయాలు, పాల్పడిన అక్రమాలను మరిచిపోయి లీగల్ నోటీసుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కేటీఆర్ చిల్లర చేష్టలకు భయపడేది లేదని, ధైర్యం ఉంటే ముఖాముఖి చర్చకు రావాలంటూ సంజయ్ సవాల్ విసిరారు.
తాను తన భార్య పిల్లలతో వస్తానన్న బండి, కేటీఆర్ కూడా ఆయన తండ్రి, తల్లి, భార్యాపిల్లలతో సహా రావాలని, ఏ గుడి అంటే ఆ గుడి, లేదూ చర్చి, మసీదు ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదని కేటీఆర్ కుటుంబంపై ప్రమాణం చేయాలనీ, అలాగే తాను తన కుటుంబ సభ్యులతో కేటీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉందని ప్రమాణం చేస్తాననీ, ఈ సవాల్ కు కేటీఆర్ సై అనాలని చాలెంజ్ చేశారు.
కేటీఆర్ స్వంత చెల్లెలు కవిత స్వయంగా ఫోన్ ట్యాపింగ్‌ను అంగీకరించారని బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో కేటీఆర్, బండి సంజయ్ మద్య రాజకీయ, వ్యక్తిగత విమర్శలు ఎంత దూరం వెడతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంద.