పిఎఫ్ ఐ పై నిషేధం అశాంతిని ప్రేరేపిస్తుంది...మాయావతి
posted on Oct 1, 2022 @ 11:03AM
దేశంలో పిఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలను కేంద్రం నిషేధించడం పై బహుజనసమాజ్‌పార్టీ (బీఎస్ పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. పిఎఫ్ ఐ పై అనేక విధాలుగా ఆంక్షలు విధిస్తూ వచ్చిన కేంద్రం ఇపుడు ఏకంగా నిషేధించిందని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. మున్ముందు విధాన సభ ఎన్నికల దృష్ట్యానే కేంద్రం తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను ఈవిధంగా ప్రదర్శిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.
పిఎఫ్ఐ ని నిషేధించడంతో దేశంలో శాంతి కంటే అశాంతి రేకెత్తడానికే అవకాశాలున్నాయని మాయా వతి అభిప్రాయపడ్డారు. ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగత్ ఢిల్లీలో మజీద్ మదరసా దర్శించి అక్కడి ముస్లిం నాయకులతో చర్చించడాన్ని కూడా ఇటీవల ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. భగత్ చర్యతో దేశంలో ముస్లింలు, మదరసాల పై బీజేపీ అభిప్రాయాలు, వ్యవహరిస్తున్న తీరులో మార్పు వస్తుందా అని ఆమె ప్రశ్నించారు. ఇతరులు తమ విషయాల్లో చొరబడుతున్నారన్న భావనను మాను కోవాలని, బీజేపీ కూడా ఇతరుల కార్యకలాపాలు, మత విషయాల్లోకి చొరబడటం ఎంతవరకూ సమం జసం అని ప్రశ్నించారు.
అనేక సందర్భాల్లో యోగి ప్రభుత్వం ముస్లింలను చులకనగా చూడడం వారి పై బురద జల్లే కార్య క్రమాలు చేపట్టడంపట్ల బిఎస్‌పి నేత విరుచుకపడ్డారు. రాష్ట్రప్రభుత్వం అనాలోచితంగానే వారి ఆస్తులు, నివాసాల పై బుల్‌డోజర్లతో దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. రెండేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఎస్ పి పార్టీ నాయకుడు అజామ్ ఖాన్ కేవలం కేంద్ర ప్రబుత్వం పై ఘాటు విమర్శలు చేయడం వల్లనే ఆయన్ను జైలుపాలు చేశారని ఆమె ఆగ్రహించారు.