వారి కోసం నా ప్రాణమైనా ఇస్తా... బాలకృష్ణ సంచలనం
posted on Feb 16, 2021 @ 10:03AM
ఏపీలో జరుగుతున్న అరాచకాలపై టీడీపీ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ మద్దతుదారులపై అధికార వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అసలు నామినేషన్లు కూడా వేయవద్దని బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామాలలోని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హిందుపూరానికి వెళ్లి.. టీడీపీ మద్దతుదారులు, వారి కుటుంబాలను, కార్యకర్తలను పరామర్శించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "‘కార్యకర్తల కోసం నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. వారికోసం నా ప్రాణాన్ని ఫణంగా పెడతా. రాష్ట్రమంతా వైసిపి నాయకులు భయాందోళనలు సృష్టిస్తున్నారు..వాళ్ళ అఘాయిత్యాలకు అడ్డుకట్టవేసే వాళ్లు లేరనుకుంటున్నారు. దీనిపై నేను హెచ్చరిస్తున్నా.. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే దానికి రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాం. కార్యర్తలు అందరు సమాయత్తంగా ఉండండి.
ఒకాయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ ఉక్కు కారాగారం అంటాడు. సీబీఐ కేసులలో ఇరుక్కుని జైలుకు వెళ్లి కారాగారం పదం బాగా అలవాటైంది. పోటీచేసే అభ్యర్థుల కుటుంబీకులు ఆఘాయిత్యాలకు పాల్పడేలా అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాష్ట్రంలో గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది" అని బాలకృష్ణ వాసిపై సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ అరాచకాలు పెరిగిపోతుండడం పై గత కొంత కాలంగా బాలకృష్ణ ఘాటైన వ్యాఖ్యలు చేస్తుండడంతో ఒక పక్క వైసిపి నేతలు కొంత వెనక్కు తగ్గుతుండగా.. మరోపక్క టీడీపీ కేడర్ లో మానసిక స్థైర్యం పెరుగుతోంది.