రిపబ్లిక్ డే పై బాహుబలి ఎఫెక్ట్..
posted on Jan 27, 2016 @ 2:37PM
తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా బాహుబలి. ఈ సినిమా ప్రభావం మాత్రం ప్రజల్లో బాగానే పడింది. ఈ సినిమా విడుదలైన తరువాత వచ్చిన వినాయ చవితి పండుగలో కూడా అలాంటి విగ్రహాలు తయారు చేసి వ్యాపారస్తులు మంచి లాభాలే పొందారు. ఇప్పుడు రిపబ్లిక్ డే పై కూడా బాహుబలి ఎఫెక్ట్ బానే కనిపిస్తుంది. నిన్న 67వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించగా అందులో ఒక వ్యక్తి బాహుబలిలో ప్రభాస్ మాదిరిగా శివలింగాన్ని భుజానికెత్తుకుని బైక్ పై నిల్చుని తన విన్యాసాన్ని ప్రదర్శించాడు. దీంతో అతని ప్రదర్శనతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు అక్కడ జరిగిన అన్ని విన్యాసాల్లో ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.