ఇక తుత్తి లేదు
posted on Nov 8, 2013 @ 7:51PM
నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం.. అనే సూత్రాన్ని తూచా తప్పకుండా ఏ క్యారక్టర్ లోనైనా అందులో తన మార్క్ కామెడీని పండించి సినిమా విజయానికి తను కూడా ఒక కారణం అయ్యేలా తన నటనను కనబరిచారు ఏ.వియస్.. రంగుపడుద్ది ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలిసిందే ఆ డైలాగ్ ని ప్రేక్షకులు మర్చిపోలేనంతగా చేసిన ఏ.వి.యస్.. ఆ సినిమా సక్సెస్ కి కీ రోల్ అనే చెప్పవచ్చు..అలాంటి ఆయన మనల్ని అందరిని శోక సముద్రంలో ముంచి తను తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు.
ఒక పక్క కమెడీయన్ గా సినిమాల్లో నటిస్తూనే డైరెక్టర్ గా మంచి మంచి సినిమాలు తీసి తన లో దాగున్న క్రియేటివ్ యాంగిల్ కూడా చూపిచారు ఏవియస్. యూత్ ఫుల్ కామెడీ సినిమాలు తీసి ప్రేక్షకులని అలరించారు. దర్శకుడు , నిర్మాత, రచయిత మరియు రాజకీయనాయకుడిగా. పాత్రికేయుడు గా కెరియర్ ని స్టార్ట్ చేసి ..మొదట చిన్న చిన్న వేషాలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక నట శైలిని ఏర్పరుచుకున్నాడు. నత్తి గా మరియు నంగిగా మాట్లాడే తుత్తి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లో కూడా కొద్దికాలం క్రియాశీలంగా పనిచేశాడు.
ముఖ్యంగా ఆయన చేసిన ప్రతి పాత్రకు ఓ డిఫరెంట్‌మేనరిజమ్‌క్రియేట్‌చేసి అందులోనుంచి హాస్యం పండించే అద్భుత నటన ఆయనది.. తొలి సినిమాలో తుత్తితో మొదలైన ఆయన నవ్వుల జల్లు తెలుగు సినీ అభిమానులను ఇప్పటికే ముంచెత్తుతూనే ఉంది. కేవలం క్యారెక్టర్‌ఆర్టిస్ట్‌గానే కాదు, హీరోగా కూడా మెప్పించాడు ఏవీయస్, తన స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హీరోస్‌సినిమాలో బ్రహ్మనందంతో కలిసి హీరోగా నటించిన ఆయన కామెడీనే కాదు ట్రాజెడీని కూడా అద్భుతంగా పడించగలనని నిరూపించుకున్నాడు.
గతంలో కూడా కాలేయ వ్యాదితోనే అస్వస్థతకు గురైన ఏవియస్‌తన కూతురి కాలేయం దానం చేయటంతో తిరిగి కోలుకున్నారు. పూర్తి స్ధాయిలో కాకపోయినా సినీరంగానికి తనవంతు సేవలందించారు. నటుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఏవియస్‌కేవలం నటునిగా మిగిలిపోవాలనుకోలేదు.. అందుకే తనను ఆదరించిన ప్రేక్షకుల కోసం రాజకీయరంగంలోకి కూడా వచ్చారు. వారికి పక్షాలన నిలబడి ఎన్నో సేవకార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
ఇలా తన నటనతో పాటు తన వ్యక్తిత్వంతో కూడా నూరేళ్లకు సరిపడా కీర్తిని సంపాదించుకున్న ఏవియస్.. ఆ జ్ఞాపకాలను వెండితెర మీద వదిలేసి ఆయన మాత్రం శాశ్వత విశ్రాంతి తీసుకుంటున్నారు. మనల్ని తన నవ్వుల జల్లులతో అలరించిన ఆయన ఆత్మ శాంతించాలని.. ఆ నవ్వుల నటుడికి నివాళి అర్పిద్దాం..