Read more!

అదరగొట్టిన ఆసీస్ అమ్మాయిలు

 

 

 

 

ఆస్ట్రేలియా అమ్మాయిలు ఆరోసారి వరల్డ్ కప్ సొంతంచేసుకున్నారు. ప్రపంచ కప్ ఫైనల్ లో ఆల్ రౌండ్ షో తో అదరగొట్టి ఆరోసారి ప్రపంచ విజేతలుగా నిలిచారు. ఆదివారం ముంబై లో జరిగిన ఫైనల్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 259 పరుగులు చేసింది. జెస్ కామెరూన్ 76 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించగా, హేన్స్ 52 పరుగులుకు తోడు జోడి ఫీల్డ్స్ 38 బంతుల్లో 36 నాటౌట్, లానింగ్ 31, పెర్రీ 22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 25 నాటౌట్ గా నిలిచి జట్టును ఆదుకున్నారు. క్వింటినె మూడు వికెట్లు తీసింది.


 

259 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్ ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ కి క్యూ కట్టారు. 41పరుగులకే 3వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆసీస్ మీడియం పేసర్ పెర్రీ వరుసగా మూడు వికెట్లు తీసి విండీస్‌ను చావు దెబ్బతీసింది. విండీస్ ను145 పరుగులకు ఆలౌట్ చేసి సూపర్ సిక్స్ దశలో ఎదురైన పరాభవానికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకు౦ది.