ఆంధ్రప్రదేశ్ లో దేవుడికే రక్షణ కరువైంది!!
posted on Jan 1, 2021 @ 5:42PM
అందరికీ ఆ దేవుడే రక్ష అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దేవుడికే రక్షణ కరువైంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 19 నెలల కాలంలో హిందూ ఆలయాలపై అనేక దాడులు జరిగాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం, రాజమండ్రిలోని శ్రీరామ్ నగర్ గణపతి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటనలు వెలుగు చూశాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదోక ప్రాంతంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఏపీకి వైఎస్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఐన తరువాత ఈ 19 నెలల కాలంలో 20 కి పైగా హిందూ దేవాలయలపై దాడుల జరిగాయి.
1. 2019 నవంబర్ 14 న.. గుంటూరు దుర్గ గుడి ధ్వంసం
2. 2020 జనవరి 21 న.. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహులు ధ్వంసం
3. 2020 ఫిబ్రవరి 11 న.. రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం
4. 2020 ఫిబ్రవరి 13 న.. ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం దుండగులు ధ్వంసం చేశారు
5. 2020 ఫిబ్రవరి 14 న.. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరా ఆలయ రధం దగ్ధం
6. 2020 సెప్టెంబర్ 6 న.. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం
7. 2020 సెప్టెంబర్ 13 న.. విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ
8. 2020 సెప్టెంబర్ 15 న.. కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి బాబా విగ్రహాలు ధ్వంసం
9. 2020 సెప్టెంబర్ 16 న.. ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం
10. 2020 సెప్టెంబర్ 16 న.. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం
11. 2020 సెప్టెంబర్ 17 న.. కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ధ్వంసం
12. 2020 సెప్టెంబర్ 19 న.. విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో
శివాలయంలో శివుడు విగ్రహాలు ధ్వంసం
13. 2020 సెప్టెంబర్ 20 న.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్నా
అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు, విగ్రహం ధ్వంసం
14. 2020 సెప్టెంబర్ 23 న.. కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్నా
ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం
15. 2020 సెప్టెంబర్ 25 న.. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం
16. 2020 అక్టోబర్ 5 న.. కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్నా
సుగని జలాశయం దగ్గర వున్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం లో
నరసింహ స్వామి శేషపడగలు ధ్వంసం
17. 2020 అక్టోబర్ 6 న.. కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ
స్వామి విగ్రహం ధ్వంసం
18. 2020 అక్టోబర్ 6 న.. గుంటూరు జిల్లా నరసరావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి
దేవి విగ్రహం ధ్వంసం
19. 2020 అక్టోబర్ 17 న.. తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ధ్వంసం
20. 2020 నవంబర్ లో.. యానాం బైపాస్,లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ద్వంసం..
21. 2020 డిసెంబర్ 29 న.. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం
22. 2020 డిసెంబర్ 31 న.. రాజమండ్రిలోని శ్రీరామ్ నగర్ గణపతి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం
ఇలా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడి ఘటనలు వెలుగులోకి వచ్చినవి కొన్నే.. వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సరైన చర్యలే లేవు. మతిస్తిమితం లేని వారి చర్యలంటూ ప్రభుత్వం, పోలీసులు కాలయాపన చేశారు. ఇక సీఎం సంగతి సరేసరి. ఇన్ని నెలలుగా దాడులు జరుగుతుంటే ఆయన నుండి సరైన స్పందనే లేదు. తాజాగా ఒక్కసారి స్పందించారు. దేవుడితో పెట్టుకోవద్దని, శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. అయితే ఆయనలా హెచ్చరించిన కొద్ది గంటల్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటన జరగడం గమనార్హం. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. రాష్ట్రంలో హిందూ ఆలయాల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. ఇక ప్రభుత్వానికి తగ్గట్టే ప్రతిపక్షాల తీరు కూడా ఉంది. దాడి జరిగినప్పుడు ఖండిస్తున్నాం అంటూ రెండు వ్యాఖ్యలు చేయడమే తప్ప.. ఇది కోట్ల మంది మనోభావాలకు సంబందించిన అంశం అంటూ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూ సరైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే చేయడం లేదు.
మరోవైపు హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక రాజకీయ కుట్రకోణం ఉందన్న అనుమానాలు విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. ఒక పార్టీ.. రాష్ట్రంలో హిందూ మతం లేకుండా చేసి, మరో మతాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తుందని అనమానపడుతున్నారు. లేదా మరో పార్టీ.. ఈ దాడులతో హిందూవులలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచి ఆ ఓట్లన్నీ రాబట్టే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న ఈ దాడుల వెనుక ఏ పార్టీ రాజకీయ పార్టీ కుట్ర కోణం ఉందో గానీ.. ఈ దాడుల మూలంగా కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ దాడుల వెనుక ఉన్న కోణాన్ని ఆ దేవుడు ఎంత త్వరగా బయటపెడితే.. అంత మంచిదన్న అభిప్రాయం అటు హిందువుల్లోనూ, ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.