పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ పై కాల్పులు
posted on Nov 3, 2022 @ 6:18PM
గురువారం పాకిస్తాన్ వజీరాబాద్ లో ఒక ర్యాలీ లో ప్రసంగిస్తుండగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఇమ్రాన్ కాలికి గాయాలయ్యాయి. ఆయనకు ప్రాణానికి ప్రమాదమేమీ లేదని అధికారులు ప్రకటించారు. కాల్పులు జరిపిన దుండగుడిని వెంటనే పట్టుకు న్నారు.
ఇమ్రాన్ శుక్రవారం నుంచి లాహోర్ లాంగ్ మార్చ్ చేపడుతున్నారు. అందులో భాగంగానే గురువారం వజీరాబాద్ ర్యాలీ లో ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. ముందస్తు ఎన్నికలు ఆశిస్తూ ఇమ్రాన్ ప్రజల మద్దతు కోరుతున్నారు. ప్రజల మద్దతుతో ప్రభుత్వం పై ముందస్తు ఎన్నికలకు ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల పాటు ప్రధాని పదవిలో ఉన్న ఇమ్రాన్ ను సభలో ఆత్మవిశ్వాస పరీక్షలో ఓడిపోయారు. దీనంతటికి కారణం దేశంలో ఆర్ధిక సంక్షోభం తలెత్తడ మేనని రాజకీయ పరిశీలకుల మాట.
కాగా ఈమధ్యనే పాకిస్తాన్ లో పెను విప్లవం రానున్నదని మాజీ ప్రధాని ఖాన్ హెచ్చరించారు. అయితే ఆ విప్లవం ఓటు హక్కును సక్రమంగా వినియోగించడం ద్వారానా, లేక రక్తపాతంతో కూడినదా అన్నది తేలాల్సి ఉందన్నారు.