హమ్మయ్య వార్నర్ శతక్కొట్టాడు!
posted on Nov 23, 2022 @ 11:10AM
డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్. స్టార్ బ్యాటర్ గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న డేవిడ్ వార్నర్ కు తెలుగు రాష్ట్రాలలో మాత్రం అసంఖ్యాకంగా అభిమానులున్నారు. ఐపీఎల్ లో చాలా కాలం పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ఉన్న వార్నర్ ను తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు వేరే దేశం క్రికెటర్ గా భావించరు.
తమ సొంత జట్టు కెప్టెన్ గానే తలపోస్తారు. దీనికి తోడు తెలుగు హీరోలను అనుకరిస్తే షేన్ వార్న్ చేసే స్ఫూఫ్ లకు చాలా చాలా బిగ్ ఫ్యాన్ లు ఉన్నారు. అలాంటి షేర్ వార్న్ ఇటీవలి కాలంలో క్రికెట్ లో ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. గత మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆసీస్ టి20 టీమ్ కు నాయకత్వం వహించాలన్న ఆయన కోరిక తీరడం మాట అటుంచి అసలు జట్టులో స్థానం ఉంటుందా అన్నంతగా వార్నర్ ను అతడి ఫామ్ ఇబ్బంది పెట్టిది. అలాంట్ వార్న్ ఎట్టకేలకు ఫామ్ దొరకబుచ్చుకున్నాడు.
ఆల్ మోస్ట్ మూడేళ్ల తరువాత వార్న్ తన ఖాతాలో సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇందుకు మెల్ బోర్న్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డే వేదిక అయ్యింది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో వార్నర్ 102 బంతులు ఎదుర్కొని 106 పరుగులు సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో వార్నర్ కు అన్ని ఫార్మాట్ లలోనూ కలిపి ఇది 44వ సెంచరీ.. కాగా వన్డేలలో 19వది. ఈ సెంచరీకి ముందు వార్నర్ 2020 జనవరిలో ముంబై లో ఇండియాపై సెంచరీ చేశాడు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డే విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది.