అసెంబ్లీకి పోయి చేసేది ఏముంది కేసీఆర్
posted on Feb 23, 2012 @ 9:57AM
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల కంటే మనకు ఉపఎన్నికలే ముఖ్యమని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. అయినా అసెంబ్లీకి పోయి చేసేది ఏముందని, ఎలాగూ సభ నుంచి సస్పెండ్ చేస్తారు కదా అని అన్నట్లుగా తెలుస్తోంది. నాగం జనార్ధన్ రెడ్డి త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకుంటారని నాగం జనార్ధన్ రెడ్డితో పాటు హరీశ్వర్ రెడ్డి కూడా పార్టీలో చేరనున్నారని తెలిపారు. నాగం నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ అభ్యర్థుల మాదిరిగానే నాగం గెలుపు కోసం కూడా పార్టీ నేతలు గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలంతా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారంలో పాల్గొనాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఈ సందర్భంగా పార్టీ నేతలకు కెసిఆర్ వివరించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో టిడిపి అభ్యర్థికి డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందని, అక్కడా ఆ అభ్యర్థికి డిపాజిట్ రాకుండా చేయాలని అన్నట్లుగా సమాచారం. మహబూబ్‌నగర్‌పై రగడ నేపథ్యంలో బిజెపిపై పార్టీ నేతలెవరూ పెదవి విప్పొద్దని ఆయన ఆదేశించారు.