ఆసియా కప్.. భారత్ హ్యాట్రిక్ సాధిస్తుందా?
posted on Aug 25, 2022 @ 12:18PM
త్వరలో ఆసియాకప్ టి-20 టోర్నీ ఆరంభానికి దుబాయ్ సిద్ధమయింది. ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ కూడా ఆట్టే దూరంలో లేదు గనుక ఈ టోర్నీకి ప్రాధాన్యత ఉంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్యనే ఎక్కువ పోటీ కనపడుతుంది. ఆసి యా అనగానే ఈ రెండు దిగ్గజాలకే క్రికెట్ వీరాభిమానులు అమితంగా ఇష్టపడతారు. గతేడాది ఐసిసి ప్రపంచకప్ పురుషుల టి 20 కప్‌తో ఇప్పటివరకూ భారత్ 19 పర్యాయాలు గెలిచింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌ల సారధ్యం మద్దతు అమితంగా పనిచేశాయని క్రికెట్ పండితులు, విమర్శకుల మాట. అయితే ఈసారి ఆసియాకప్‌కు ద్రావిడ్ స్థానంలో వి.వి. ఎస్.లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించారు. భారత్ హ్యాట్రిక్ సాధిస్తుందన్న ఆశలు యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులూ వ్యక్తం చేస్తున్నారు.
ఈ పర్యాయం కూడా భారత్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాటింగ్‌తో పాటు వాట్సన్ కూడా అభిప్రాయ పడటం గమనార్హం. ఆగష్టు 28న భారత్, పాక్ తలపడనున్నాయి. పాకిస్తాన్ కంటే భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ గట్టి సత్తా ప్రద ర్శించడానికే అవకాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా భారత్ రెట్టింపు ఉత్సాహంతో, గెలుస్తామన్న గొప్ప కాన్ఫిడెన్స్ ప్రదర్శి స్తూ, పట్టుదలతో ఆడటం గమనిస్తాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటివారు ఎంతో ధాటిగా ఆడి జట్టు శక్తి సామర్ధ్యాలను రెండింతలు పెంచే తీరు చూడచక్కనిది. అయితే ఇటీవల అంతగా ఫామ్‌లో లేని కోహ్లీ ఈ టోర్నీలో తప్పకుండా పాత విరాట్ విశ్వరూపం ప్రదర్శించగలడని వీరాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అతను భారత్‌కి కేవలం 16 మ్యాచ్‌లే అడాడు. వాటిలో ఒక్కటే టీ 20 కావడం గమనార్హం. అదీ జూలై లో ఇంగ్లాండ్ మీద ఆడింది. ఈ మధ్య సిరీస్‌లకు విశ్రాంతి తీసుకోవడం కోహ్లీకి ఒకవిధంగా మంచిదేనని, ఇపుడు ఫ్రెష్‌గా బరిలోకి దిగి ఎంతో కాన్ఫిడెన్స్‌గా ఆడటానికి అవకాశం ఉందని ప్రపంచ క్రికెట్ సీనియర్లు నమ్ముతున్నారు.
జట్టు విషయానికి వస్తే.. రోహిత్ శర్మ నాయకత్వంలో రాహుల్,విరాట్,సూర్యకుమార్ యాదవ్, రిషబ్,దీపక్ హుడా,దినేష్ కార్తి క్, హార్దిక్ పాండ్యా,రవీంద్రజడేజా, ఆర్.అశ్విన్, యజువేంద్రఛాహల్, రవి విష్ణోయ్, భువనేశ్వర్,అర్షదీప్‌సింగ్, ఆవేశ్‌ఖాన్ ఆడను న్నారు. స్టాండ్‌బైలుగా శ్రేయాష్ అయ్యర్, ఆక్షర్‌పటేట్, దీపక్ చాహర్ ఉన్నారు. కాగా వీరిలో రన్‌మిషన్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు కొండంత అండగా చెప్పాలి. చిత్రమేమంటే ఎప్పుడూ అంతగా కనిపించని దూకుడు తత్వం ప్రదర్శిం చడం గమనార్హం. ఇది ప్రస్తుత టోర్నీకి ఎంతో అవసరమన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ స్ట్రయిక్ రేట్ కూడా 142 ఉండటం ఈ టోర్నీకి ఎంతో ఉపయోగపడుతుంది. కెప్టెన్ శర్మతో పాటు ఓపనింగ్ కి దిగితే పవర్‌ప్లే అత్యంత ఆసక్తిక రంగా సాగు తుందనే అనాలి. ప్రేక్షకులకు తప్పకండా వీరిద్దరూ దీపావలి ఆనందాన్నిస్తారు. విశ్రాంతి తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన కోహ్లీ, ఇప్పటికే ఉత్తమ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌లు మిడిల్ ఆర్డర్‌ను మరింత దూకుడుగా ముందుకు తీసికెళ్లి మంచి స్కోర్ ఖాయిలా చేయవచ్చు. చివరలో దినేష్ కార్తిక్ బ్యాటింగ్ విధానం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఐపిఎల్‌లో అతను ఆ సత్తాను ఇప్పటికే ప్రదర్శించాడు. అందువల్ల దినేష్, రిషబ్‌ల మధ్య మంచి పోటీనే చూడగలమని అనాలి. వారిద్దరూ ఐపిఎల్‌లో ధాటిగా ఆడటం, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నవారే. వారిద్దరికి ప్రత్యర్ధుల బౌలింగ్‌ను నీరుగార్చడంలో ఎంతో పేరుంది. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే, చాహల్ తప్పకుండా లీడ్ బౌలర్‌గా కనపడతాడు. అతను కేవలం 7.06 ఎకానమీతో 13 మ్యాచ్‌లో ఏకంగా 16 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ తో తలపడిన సిరీస్‌లో తన సత్తాను చాటడంలో ఇంగ్లీష్ బ్యాటర్లను వణికించాడు. అయితే, పేస్ అటాక్‌లో బుమ్రా, పాండ్యాలు మరిం విజృంభించాల్సి ఉంది. అలాగే పేసర్లలో లీడ్‌గా ఉన్న భువనేశ్వర్‌పైనా ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈ ఏడాది ఎలాంటి గాయాలకు గురికాలేదు గనుక అతను ఐపీఎల్‌లోనూ ఎంతో ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు గనుక అతని మీదా ఆశలు ఉన్నాయి.
ఈసారి బాబర్ అజామ్, మొహమ్మద్ రిజ్వాన్‌లతో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక జట్టు కూడా భారత్‌కు గట్టి పోటీ నిచ్చే అవకాశాలున్నాయని క్రికెట్ మేధావులు అంటున్నారు. అలాగే అంతర్జాతీయ కూనలుగా పేర్కొంటున్న ఆప్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్ లైన్ ఆప్ ఈసారి ఇబ్బందిపెట్టే అవకాశాలున్నాయి. ఇటీవల ఇర్లాండ్ తో తలపడిన సిరీస్‌లో ఓటమి చవిచూసినప్పటికీ ఆఫ్ఘన్ ను తక్కువ అంచనా వేయనవసరం లేదు.