ఆసియా ఛాంపియన్ భారత్
posted on Oct 15, 2022 @ 4:10PM
మందన, హర్మన్‌ప్రీత్, రాణా, రాజేశ్వరీగైక్వాడ్ విజృంభించడంతో టీమ్ ఇండియా మహిళలజట్టు ఆసి యా కప్ టి20 ట్రోఫీని ఏడో పర్యాయం చేజిక్కించుకుంది. సిల్హత్‌లో జరిగిన ఫైనల్లో భారత్ శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మందన తన సహజ బ్యాటింగ్ సత్తాతో లంక బౌలర్లను చెండాడి 51 పరుగు లతో అజేయంగా నిలిచింది. శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 65 పరుగులు చేయగా భారత్ 2 వికెట్ల నష్టానికి ఆ లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ టోర్నీ ఆరంభించినప్పటి నుంచి చూస్తే భారత్ జట్టు అద్భు త ప్రదర్శన ఇస్తూనే ఉంది. అందుకు మరో ఉదాహరణ శనివారం మహాద్బుతంగా ఆడి, ఏడవ పర్యా యం టైటిల్ కైవ సం చేసుకోవడమే.
అసియాకప్ ఫైనల్ చాలా మామూలు మ్యాచ్‌లా సరదా సరదాగా ఆడి సునా యాసంగా గెలవడం ఎలా గన్నది మందనా టీమ్ చూపించింది. అన్ని విధాలా ఆసియాకప్ టోర్నీలో భార త్ జట్టు పటిష్టత క్రికెట్ లోకానికి స్పష్టమైంది. మొన్నటి సెమీస్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన శ్రీలం క భార త్‌కు గట్టి పోటీని స్తుం దని లెక్కలు వేసుకున్నవారికి భారత్‌జట్టు సునాయాసంగా గెలిచి సమా ధానం చెప్పింది.
శ్రీలంక ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచే భారత్ బౌలర్లు కట్టడి చేశారు. బౌలర్లకు ముఖ్యంగా స్పిన్నర్లకు ఎంతో అనుకూలమైన పిచ్ మీద ముందుగా లంక బ్యాట్ చేయడమే వారిని దెబ్బతీసింది. భారత్ బౌలర్లు వారి ఊహను దెబ్బతీస్తూ వారి స్టార్‌బ్యాటర్లును కట్టడి చేశారు. లంకజట్టులో ఎవ్వరూ నిలకడగా ఆడి పెద్దగా పరుగులు చేయలేక వెనుదిరిగి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. భారత్ బౌలింగ్, ఫీల్డింగ్ స్థాయి ఎంతో పెరిగిందనేది ఈ మ్యాచ్ తెలియజేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఇనోరా రణవీరా అత్యధి కంగా 22 బంతుల్లో 18 పరుగులు చేసింది. భారత్ పేసర్లు, స్పిన్నర్ల ప్రభావాన్ని ఇది తెలియజేస్తుంది. రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహారాణా చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. పేసర్ రేణుకాసింగ్ అద్బుతంగా ఇన్‌స్వింగ్స్‌తో లంక బ్యాటర్లను భయపెట్టిందనాలి. ఆమె మూడు ఓవర్లో కేవలం 5 పరుగు లకు 3 వికెట్ల తీసుకున్నది. అంటేనే లంక బ్యాటర్లు ఎంతగా చిత్తయ్యారన్నది స్పష్టమవుతుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ ధాటిగా ఆడుతూ భారత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించినప్పటికీ ఆమె వెనుదిరగడం కొంత ఇబ్బంది పెట్టింది. అయితే మందన మాత్రం ఎలాంటి బెరుకూ లేకుండా సహజసిద్ధ లెఫ్టీల ధాటిని ప్రదర్శించడంలో లంక బౌలర్లను చితకబాదింది. అయితే ఈ మ్యాచ్‌లో విజయలక్ష్యం అంతగా లేదు గనుక ఓపెనర్ షఫాలీ వర్మ ఫోర్లతో విజృంభించి విజయానికి బాటలు వేస్తుందని ఆశించారు. ధాటిగా ఆడుతూ వేగంగా స్కోర్ పెంచడంలో ఆమె సిద్ధహస్తురాలు గనుక ప్రేక్షకులు ఆమె వీరవిహారం చేస్తుం దనే ఆశించారు. కానీ దురదృష్టవశాత్తూ ఆమె ఈ మ్యాచ్‌లోనూ పెద్దగా ఆడలేకపోయింది.