ఆశావర్కర్‌పై గ్యాంగ్‌రేప్..
posted on May 21, 2016 @ 10:04AM
మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆశావర్కర్‌ను కిడ్నాప్ చేసి గుర్తుతెలియని దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. నిన్న రాత్రి ఒక ఆశావర్కర్ నర్సాపూర్‌లో ఓ సమావేశానికి హాజరై ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్తోంది. ఆ సమయంలో ఐదుగురు గుర్తుతెలియని దుండగులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆశావర్కర్‌పై సామూహిక అత్యాచారం చేసి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. రాత్రంతా వర్షం కురవడంతో ఆ వైపుగా ఎవరూ వెళ్లకపోవడంతో ఆమె వర్షంలో స్పృహ లేకుండా పడిపోయింది.
ఇవాళ ఉదయం అటుగా వెళ్తున్న కొందరు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు బాధితురాలిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం అవుతోందని, జరిగిన ఘోరం తాలుకు షాక్ నుంచి ఆమె తేరుకోలేదని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆశా కార్యకర్తను హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.